కరీంనగర్‌లో 'అతడు' సీన్‌ రిపీట్‌

12 Aug, 2019 15:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో 2005లో వచ్చిన అతడు చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఇప్పటీకీ చూసినప్పుడల్లా తెగ నవ్వులు తెప్పిస్తుంటాయి. అయితే అచ్చు అతడు చిత్రంలో సన్నివేశం తరహాలోనే ఓ సంఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. అతడు చిత్రంలో విలన్‌ తనికెళ్ల భరణి, కొడుకు బ్రహ్మజీతో .. మర్డర్‌ చేయాలంటే కత్తులుండాలి కానీ, క్వాలీసులు, సుమోలు ఎందుకురా భుజ్జీ.. అన్ని బండ్లు వద్దురా పెట్రోల్‌ రేట్లు పెరిగాయి కదా.. అందరూ కలిసి ఒకే బండిలో వెళ్లండిరా.. మీరెంత సైలెంట్‌గా ఉంటే మర్డర్‌ అంత వైలెంట్‌గా ఉంటది.. అంటూ చెబుతాడు ... తర్వాత సీన్‌లో అందరు రౌడీలు కలిసి ఇరుక్కుని మరీ ఒకే సుమోలో కూర్చోని వస్తారు.. సీరియస్‌ సిచ్చువేషన్‌లోనూ కామెడీ పూయించే ఆ సన్నివేశం అందరికీ గుర్తుండిపోతుంది.


తెగ నవ్వు తెప్పించే అలాంటి సన్నివేశమే కరీంగర్‌లోని తిమ్మాపూర్‌లో చోటుచేసుకుంది. అబ్దుల్ అనే ఓ ఆటో డ్రైవర్ తన వాహనంలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని తిమ్మాపూర్ వెళ్తూ పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత పోలీసులు ఆటోలో ఉన్న ప్రయాణికులను కిందకు దింపి లెక్కించారు. మహిళలు, పిల్లలు కలిపి మొత్తం 24 మంది ఒకే ఆటో నుంచి దిగడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భద్రతపై బాధ్యత వహించాలని దీనికి సంబంధించి వీడియోను కరీంనగర్‌ సీపీ కమాలాసన్‌ రెడ్డి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాయలసీమ అభివృద్ధికి సహకరిస్తాం : కేసీఆర్‌

నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద విషాదం

‘గోవుల మృతి వెనుక కుట్రకోణం’

అత్తివరదరాజు స్వామిని దర్శించుకున్న కేసీఆర్‌

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ఘట్టం 

తాళం వేసిన ఐదిళ్లల్లో చోరీ

పంద్రాగస్టుకైనా అందేనా?

తరలిపోయిన వజ్ర బస్సులు

మాటలతోనే మభ్యపెడుతున్నారు..

మళ్లీ బడికి..

సిద్దిపేట.. ఆలయాల ఖిల్లా   

కమలం గూటికి మోత్కుపల్లి?

భర్త ఇంటిముందు భార్య దీక్ష

ఇదిగో బహుమతి..  

ఏళ్లుగా.. ఎదురుచూపులే

కృష్ణా ఉగ్రరూపం.. సాగర్‌ గేట్ల ఎత్తివేత

ఏం జరుగుతోంది..?

సాహో.. బాహుబలి

జలపాతం.. జరభద్రం

హెల్మెట్‌ మస్ట్‌

పౌచ్‌ మార్చి పరారవుతారు

పుట్టినరోజే మృత్యువాత 

'కస్టమ్స్‌'.. తీర్చేయాప్‌

అక్టోబర్‌లో ‘ఓటర్ల’ సవరణ 

‘బాహుబలి’ ఐదో మోటార్‌ వెట్‌రన్‌ సక్సెస్‌

ఐఐటీ మేటి!

బలగం కోసం కమలం పావులు 

సాగర్‌ @202 టీఎంసీలు

రెండు పంటలకు ఢోకా లేనట్లే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నిరీక్షణ’కోసం విలన్‌గా మారిన హీరో

కంటెంట్‌ బాగుంటేనే ఆదరిస్తున్నారు: పృథ్వీ

13 ఏళ్ల తర్వాత విజయశాంతి తొలిసారిగా..

ఇస్మార్ట్‌ డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ

తూనీగ డిజిట‌ల్ డైలాగ్‌ విడుదల

క్షమాపణ చెప్పిన మమ్ముట్టి