మూఢ నమ్మకాలు వద్దు

14 Oct, 2014 01:10 IST|Sakshi
మూఢ నమ్మకాలు వద్దు

జిల్లా ఎస్సీ రాజకుమారి
తాండూరు రూరల్: మూఢ నమ్మకాలు వద్దని, వీటిపై ప్రజలకు క ళాజాత బృదంతో మరింత అవగాహన కల్పిస్తామని జిల్లా ఎస్పీ రాజకుమారి అన్నారు. సోమవారం సాయంత్రం తాండూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఫైళ్లు పరిశీలించేందుకు వచ్చిన ఆమె విలేకర్లతో మట్లాడారు. అక్రమసంబంధాల వ ల్లనే హత్యలు పెరుగుతున్నాయన్నారు. తాండూరు డివిజన్ పరిధిలో దొంగతనాలు తగ్గుముఖం పట్టాయన్నారు.

డివిజన్ పరిధిలో గత మూడేళ్లకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించానని చెప్పారు. 2012లో తాండూరు డివిజన్‌లో 527 కేసులు నమోదు కాగా 13 మాత్రమే దర్యాప్తులో ఉన్నాయన్నారు. 2013లో 660 కేసులకు గాను 127 దర్యాప్తులో ఉండగా 2014(ఆగస్టువరకు) 468 కేసులు నమోదు కాగా 364 దర్యాప్తులో ఉన్నాయని ఆమె చెప్పారు.దర్యాప్తులో ఉన్న కేసులకు వెంటనే కొర్టులో చార్జీషిట్ వేయాలని డీఎస్పీని ఆదేశించినట్లు ఎస్పీ చెప్పారు. డివిజన్ లో 2014లో 78 శాతం దొంగతనాల రికవరీ జరిగిందన్నారు. 2012లో లాభం కోసం చేసిన హత్యలు 6 నమోదవగా రెండేళ్లుగా ఎలాంటి కేసులు నమోదు కాలేదన్నారు.  పట్టణంలో చోరీలు తగ్గుముఖం పట్టాయన్నారు.  
 
అట్రాసిటి కేసుల దర్యాప్తు వేగవంతం

తాండూరు డివిజన్ పరిధిలో ఎస్సీ,ఎస్టీ, వరకట్న కేసులకు సంబంధించి 2012 లో 19 కేసులు నమోద య్యాయని  ఎస్పీ రాజకుమారి తెలిపారు. ఇందులో 15 ఎస్సీ,ఎస్టీ కేసులు కాగా, 4 వరకట్న కేసులు నమోదయ్యాయన్నారు. 2013 లో 35 నమోదు కాగా ఇందులో 31 ఎస్సీ,ఎస్టీ, 4 వరకట్నం కేసులు ఉన్నాయన్నారు. 2014(ఆగస్టు వరకు) 14 నమోదు కాగా ఇందులో రెండు  వరకట్నం కేసులు నమోదయ్యాయన్నారు. ఎస్సీ,ఎస్టీ కేసుల దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, రూరల్ సీఐ శివశంకర్‌లు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు