గాంధీ వైద్యురాలిపై దాడి

10 Sep, 2019 11:09 IST|Sakshi

గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగంలో విధులు నిర్వహిస్తున్న హౌస్‌సర్జన్‌పై మృతుని కుటుంబ సభ్యులు దాడికి పాల్పడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మేడిపల్లికి చెందిన జావీద్‌ అనే వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం అతడిని గాంధీ అత్యవసర విభాగంలో అడ్మిట్‌ చేశారు. 85 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న జావీద్‌ సాయంత్రం మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని   ఆరోపిస్తూ మృతుని కుటుంబసభ్యులు, బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న లేడీ హౌస్‌సర్జన్‌పై దాడిచేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

నిందితులను కఠినంగా శిక్షించాలి
వైద్యురాలిపై దాడి చేసిన నిందితులపై కేసుల నమోదు చేసి కఠినంగా శిక్షించాలని టీజీజీడీఏ గాంధీయూనిట్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వసంత్‌కుమార్, జూడాల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ అర్జున్, లోహిత్‌ డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు