అగ్నివేష్‌పై దాడిచేసిన వారిని శిక్షించాలి

23 Jul, 2018 10:19 IST|Sakshi
నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజాసంఘాల నాయకులు

వనపర్తి అర్బన్‌: సామాజిక కార్యకర్త, ఆర్య సమాజ్‌ ప్రముఖ్, కుర వృద్ధుడైన అగ్నివేష్‌పై దాడి చేయడం అత్యంత అమానుషమని, దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని టిజేఏసీ, ఎమ్మార్పీఎస్,  పాలమూరు అధ్యాయన వేదిక, పీడీఎస్‌ఊయూస్‌యు, డీటీఎఫ్‌ ప్రజా సంఘాల నాయకులు ఖండించారు. ఆదివారం పట్టణంలోని యాదవ సంఘం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జార్ఖండ్‌ గవర్నన్‌ను కలిసి గిరిజనుల సమస్యలను విన్నవించి తిరిగి వెళ్తున్న సమయంలో మతోన్మాద గుండాలు ఆయనపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను, లౌకికవాదాన్ని, వాక్‌స్వాతంత్య్రాన్ని ప్రభుత్వాలు అణగదొక్కేస్తున్నాయని, దేశవ్యాప్తంగా ఎందరో సామాజిక కార్యకర్తలపై దాడులు నిరంతరం చేయడం మతోన్మాద చర్యలను ప్రేరేపించడమేనన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రభుత్వాలకు ప్రజలకు తగిన రీతిగా బుద్ధి చెప్పే సమయం ఎంతో దూరం లేదని చెప్పారు. అగ్నివేష్‌పై జరిగిన దాడుల్లో పాల్గొన్న వారికి గుర్తించి శిక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్‌ చేశారు. భవిషత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాజారాంప్రకాష్, వేణుగోపాల్, బుచ్చన్న, యేసేపు, శ్రీనివాసులుగౌడ్, అగ్గిరాముడు, నారాయణ, శ్రీనివాసులు, పవన్, గోపి, బుచ్చన్న, శాంతన్న, స్వామి, సత్యనారాయణ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు