వేటకత్తితో తమ్ముడిపై అన్న దాడి

14 Jun, 2018 13:03 IST|Sakshi
కత్తితో బాపురెడ్డి, గాయపడ్డ లక్ష్మారెడ్డిని ఆటోలో తరలిస్తున్న స్థానికులు

భూతగాదాలతో ఇద్దరి మధ్య గొడవ

తహసీల్దార్‌ కార్యాలయంలోనే హత్యాయత్నం

సాక్షి, భీమిని(నెన్నెల) : నెన్నెల మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన  లక్ష్మారెడ్డిపై అన్న బాపురెడ్డి బుధవారం నెన్నెల తహసీల్దార్‌ కార్యాలయంలోనే వేట కత్తితో హత్యాయత్నం చేశాడు. భూతగాదనే అన్నదమ్ముల మధ్య గొడవకు దారితీసింది. బొప్పారం గ్రామశివారులో సర్వేనంబర్‌707/1లో 3.14ఎకరాలు, 708 సర్వే నంబర్‌లో 4.36ఎకరాలు ఉన్న ఈ భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గతకొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బాపురెడ్డి తన వాటలోని కొంత భూమిని ఇతరులకు అమ్ముకున్నాడు. ఆ భూమి రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు తమ్ముడు సంతకం చేయాల్సి ఉంది.

కాగా బుధవారం రిజిస్ట్రేషన్‌ కోసం నెన్నెల తహసీల్దార్‌ కార్యాలయానికి అన్నదమ్ములిద్దరు వేర్వేరుగా వచ్చారు. తమ్ముడు అభ్యంతరం చెప్పాడని ముందుగానే ఊహించిన బాపురెడ్డి పథకం ప్రకారం తన వెంట ఓ కవర్‌లో కారంపొడి, వేటకత్తి తెచ్చుకున్నాడు. తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ విషయమై మాటమాట పెరిగి గొడవకు దిగారు. అంతలోనే అందరు చూస్తుండగానే లక్ష్మారెడ్డి కళ్లలో కారంకొట్టిన బాపురెడ్డి కత్తితో దాడిచేశాడు. ఇంతలోనే కొందరు యువకులు తేరుకొని బాపురెడ్డిని అడ్డుకున్నారు. అప్పటికే లక్ష్మారెడ్డి తలపై రెండుచోట్ల గాయాలయ్యాయి. యువకులు ధైర్యం చేసి అడ్డుకోకపోతే లక్ష్మారెడ్డి ప్రాణాలు దక్కేవి కావని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే తహసీల్దార్‌ రాజలింగు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాపురెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మారెడ్డికి నెన్నెల పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నెన్నెల ఎస్సై చందర్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అఖిల్‌కు మరో అవకాశం

పక్కాగా... పకడ్బందీగా..

నాన్నకు బహుమతిగా మినీ ట్రాక్టర్‌

సహకార ఎన్నికలు లేనట్టేనా?

‘కర్మభూమితో పాటు కన్నభూమికీ సేవలు’

కన్నెపల్లిలో మళ్లీ రెండు మోటార్లు షురూ

బీసీలు, ముస్లింలకు సగం టికెట్లు

వ్యక్తి ప్రాణాలకంటే కులానికే ప్రాధాన్యమా?

జనం గుండెల్లో.. హిస్‌స్‌.. 

హైదరాబాద్‌కు ఐసిస్‌ నమూనాలు!

ముసద్దిలాల్‌ జ్యువెల్లర్స్‌పై మరో కేసు

బీసీగా ప్రచారం చేసుకుని ప్రధాని అయ్యారు

కంప్యూటర్‌ సైన్సే కింగ్‌!

ట్రాఫిక్‌.. ట్రాక్‌లో పడేనా?

సాక పెట్టి సాగంగ... మొక్కులు తీరంగ 

వైద్యుల నిర్లక్ష్యం.. నిరుపేదకు 8 లక్షల పరిహారం 

722 గంటలు.. 5.65 టీఎంసీలు! 

అంతరిక్ష యవనికపై జాబిల్లికి జైత్రయాత్ర!

ఏమిటీ ‘పోడు’ పని

సింగపూర్‌లో ఘనంగా బోనాల వేడుకలు

ఈనాటి ముఖ్యాంశాలు

షేక్ సద్దాంను హత్య చేసిన నిందితుల అరెస్ట్‌

పాదచారులపైకి దూసుకెళ్లిన ఇన్నోవా.. ముగ్గురు మృతి

అన్నా.. గడ్డంతో చాలా అందంగా ఉన్నారు

'మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్‌వే'

విదేశీ కరెన్సీ జిరాక్స్‌ నోట్లు ఇచ్చి.. భారీ మోసం!

కిషన్‌రెడ్డి పర్యటన.. ఫ్లెక్సీలు తగలబెట్టడంతో ఉద్రిక్తత

నిలిచిన విమానం.. ప్రయాణికుల ఆందోళన..!

ఎనిమిది వేల ఇళ్లు మంజూరు చేయిస్తా

నాసిరకం సరుకులు సరఫరా చేశారు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు