ప్రజా సంఘాలపై దాడులు సరికాదు

12 Dec, 2016 14:40 IST|Sakshi
ప్రజా సంఘాలపై దాడులు సరికాదు

పొత్తూరి వెంకటేశ్వర్‌రావు
హైదరాబాద్: ప్రజా సంఘాలపై ప్రభుత్వం దాడులకు పాల్పడటం సరికాదని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం ప్రజా కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సీజ్ చేసిన తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టీయూఎఫ్) కార్యా లయాన్ని తెరిపించాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమా వేశం నిర్వహించారు. పొత్తూరి మాట్లాడుతూ ఇలాంటి చర్యల ద్వారా పోలీసులు సాధించేదేమీ లేదన్నారు. కళా కారులు, కవులు, రచరుుతల జోలికి వెళితే ప్రజలు తిరగ బడతారన్న విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ ప్రభుత్వాలు ఇంకా పాత పద్ధతినే అను సరిస్తున్నాయని, పోలీసులు అనుకుంటే ఎవరినైనా నేర స్తుల్ని చేస్తారని ఆరోపించారు.

సీనియర్ సంపాదకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ విమలక్క పాట లేకుం డా తెలంగాణ ఉద్యమాన్ని ఊహించ లేమన్నారు. విమలక్క మాట్లాడుతూ తన కార్యాలయాన్ని సీజ్ చేశారు.. అనటం కంటే పోలీసులు కబ్జా చేశారంటే బాగుంటుం దన్నారు. పీవోడబ్ల్యు అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ కోర్టు ఆర్డర్ లేకుండా పోలీసులు ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నించారు. ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బిక్షమయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు కె.గోవర్దన్, సీపీఐ నేత కందిమల్ల ప్రతాప్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ప్రొఫెసర్ కాసీం, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు నలమాస కృష్ణ, తెలంగాణ లోక్‌సత్తా నాయ కుడు మన్నారం నాగరాజు  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు