ఆటో డ్రైవర్లే దేశానికి బ్రాండ్ అంబాసిడర్లు

4 Aug, 2014 05:00 IST|Sakshi
ఆటో డ్రైవర్లే దేశానికి బ్రాండ్ అంబాసిడర్లు
 • అవగాహన కల్పించిన డాక్టర్ వైఎస్సార్ నిథమ్ విద్యార్థులు
 •  రాయదుర్గం: విదేశీ పర్యాటకులను ఆక ర్షించడంలో ఆటో డ్రైవర్లు ముఖ్య భూమిక పోషించాలని వక్తలు పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేనేజ్‌మెంట్ వీక్‌లో భాగంగా ఆదివారం విద్యార్థులు, అధ్యాపకులు ఆటోడ్రైవర్లకు అవగాహన కల్పించారు.

  ఈ సందర్భంగా గోల్కొండ కోట, గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్ కూడలి, ఎల్‌అండ్‌టీ టవర్స్ ప్రాంతం, మాదాపూర్, శిల్పారామం, ట్రిపుల్ ఐటీ కూడలి ప్రాంతాల్లో నడిచే ఆటోలకు ‘టూరిస్ట్ ఫ్రెండ్లీ ఆటో’ పేరిట ఏర్పాటు చేసిన స్టిక్కర్లను అతికించారు. ఆటో డ్రైవర్లే మనదేశ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని, విదేశీయులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.
   
  సందడి చేసిన విదేశీ విద్యార్థులు...

   
  డాక్టర్ వైఎస్సార్ నిథమ్‌లో విదేశీ విద్యార్థులు సందడి చేశారు. నిథమ్‌లోని స్ల్కప్చర్ పార్కులో ఏర్పాటు చేసిన విగ్రహాల ప్రాధాన్యతను, పచ్చదనంతో కూడిన వాతావరణం, కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నగరంలో ఉంటున్న నైజీరియా, దక్షిణాఫ్రికా, జాంబియా, భూటాన్, నమీబియా, మొజాంబిక్ వంటి దేశాల విద్యార్థులు పాల్గొన్నారు.

  రాష్ట్ర ఆర్కియాలజీ అండ్ మ్యూజియం మాజీ డెరైక్టర్ డాక్టర్ కేదారేశ్వరి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రవికుమార్ నండూరి, ప్రముఖ ఆర్కిటెక్చర్ మధు, డాక్టర్ వైఎస్సార్ నిథమ్ ప్రొఫెసర్ పి.నారాయణరెడ్డి వివిధ అంశాలపై వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ వైఎస్సార్ నిథమ్ కార్యక్రమ కోఆర్డినేటర్లు మిషెల్లి జే ప్రాన్సిస్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
   

మరిన్ని వార్తలు