నిజాయితీ చాటుకున్న ఆటోవాలా

17 Jan, 2018 15:49 IST|Sakshi

ఎస్‌ఆర్‌నగర్(హైదరాబాద్‌)‌: నిజాయితీ కరవైన ఈ రోజుల్లో ఓ ఆటోవాలా తన నిజాయితీని చాటుకున్నాడు. తాను నడుపుతున్న ఆటోలో ప్రయాణించిన వారి బంగారు ఆభరణాలు ఆటోలో జారిపోయాయి. ఇది గమనించని వారు ఆటో దిగి వెళ్లిపోయారు. తర్వాత వాటిని గమనించిన ఆటో డ్రైవర్‌ మీర్జా మహమూద్‌ ఆరున్నర తులాల బరువున్న ఆ ఆభరణాలను ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు అప్పగించాడు. నిజాయితీ ప్రదర్శించిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అభినందించారు. సీఐ వహిదుద్దీన్‌ ఆయన్నుసన్మానించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు