గుట్టపైకి బస్సులు నడపొద్దంటూ ఆటోవాలాల ఆందోళన

15 May, 2015 19:18 IST|Sakshi
గుట్టపైకి బస్సులు నడపొద్దంటూ ఆటోవాలాల ఆందోళన

యాదగిరిగుట్ట (నల్లగొండ) : యాదగిరిగుట్టపై శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకూ నడుపుతున్న బస్సు సర్వీసులను నిలిపివేయాలని కోరుతూ స్థానిక అటోల యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆటో డ్రైవర్లు గంటసేపు రోడ్డుపైనే ధర్నా నిర్వహించి, వచ్చిపోయే వాహనాలను నిలిపివేశారు. దీంతో ట్రాఫిక్‌జామ్ అయ్యి భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ... గత కొన్ని సంవత్సరాలుగా తాము ఆటోలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, కొండపైకి బస్సులు వేయడంతో రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా ఆర్టీసీ బస్సులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని యాదగిరిగుట్ట డిపో మేనేజర్ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి హెచ్చరించారు. ఆటో నాయకులు వారి కోరికల మేరకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోరాటం చేసుకోవాలని, ఆర్టీసీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించరాదన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా మూడు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు