సీఎం దృష్టికి ఆటోడ్రైవర్ల సమస్యలు

2 Aug, 2017 02:46 IST|Sakshi
సీఎం దృష్టికి ఆటోడ్రైవర్ల సమస్యలు
- తీసుకెళ్తానని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి హామీ
హన్మకొండలో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం
 
హన్మకొండ చౌరస్తా/జనగామ/ఖిలా వరంగల్‌: తెలంగాణ ఉద్యమంలో ఆటోడ్రైవర్ల పాత్ర మరువలేనిదని.. వారి న్యాయమైన సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా నని రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్స వాన్ని పురస్కరించుకుని మంగళవారం హన్మకొండలో భారీ బహిరంగ సభ నిర్వ హించారు. అంతకుముందు మంత్రి జన గామ, మడికొండల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఆటోడ్రైవర్ల యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్‌ అ«ధ్యక్షతన జరిగిన సభలో ముందుగా ఆటోడ్రైవర్లు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించిన మంత్రి త్వరలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. బస్సు సౌకర్యంలేని ప్రాంతాల్లో ఆటో షెల్టర్లను నిర్మించేందుకు కృషి చేస్తాన న్నారు. సభా వేదిక నుంచి యూనియన్‌ ప్రవేశపెట్టిన 11 తీర్మానాలలో తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించి.. మిగిలినవి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ తానన్నారు.  రాష్ట్రంలో రూ.350 కోట్లతో కొత్తగా 1,400 బస్సులను కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో ఐదు ఎకరాల స్థలంలో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చేందుకు రూ.5 కోట్లతో కేంద్రాలను నిర్మించాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 
మరిన్ని వార్తలు