ఆటోల దొంగ అరెస్ట్

13 Jan, 2016 23:00 IST|Sakshi

హైదరాబాద్: ఆటోల దొంగతనానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతని నుంచి రెండు ఆటోలను కూకట్‌పల్లి పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సురేందర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... గత నెలలో కూకట్‌పల్లి సంగీతనగర్‌లో పార్కు చేసిన ఆటోలను దొంగలించుకువెళ్లారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం మూసాపేట క్రాస్‌రోడ్డులో వాహనాల చెకింగ్ చేస్తుండగా అనుమానస్పదంగా వెళ్తున్న దున్నపోతుల స్వామి (22)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతడిని విచారించగా గతంలో ఆటోల దొంగతనానికి పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించడంతో అతని వద్ద నుంచి రెండు టాటా మ్యాజిక్ ఆటోలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు