సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య పానీయమైన నీరా పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆబ్కారీశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం యూత్ లీడర్స్ ఫౌండేషన్– ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో రూపొందించిన నీరా ప్రచార కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అన్ని ఔషధ గుణాలు కలిగిన, ప్రకృతి సహజంగా లభించే నీరాను ప్రజలకు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, టీఎస్‌ఈడబ్లూఐడీసీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, ఉస్మానియా యూనివర్సిటీ యూత్ లీడర్స్ ఫౌండేషన్ నాయకులు పాల్గొన్నారు.