అభివృద్ధితోనే పేదరిక నిర్మూలన

18 Oct, 2016 03:06 IST|Sakshi
అభివృద్ధితోనే పేదరిక నిర్మూలన

నీతి ఆయోగ్ చైర్మన్ పనగారియా
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధితోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియా పేర్కొన్నారు. సరళీకరణ విధానాలతో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. జాతీయ పోలీస్ అకాడమీలో సోమవారం వల్లభాయ్‌పటేల్ సంస్మరణ ఉపన్యాసం చేశారు. కొన్నేళ్లుగా దేశం ఆర్థికాభివృద్ధి సాధించడంతో పేదరికం కొంతమేర తగ్గుముఖం పట్టిందన్నారు.

పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 109 మంది ఐపీఎస్, 15 మంది విదేశీయులను ఉద్దేశించి మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలతో దేశం ఆర్థికంగా పురోగమిస్తోందన్నారు. గ్లోబల్ మార్కెట్‌పై పట్టు సాధిస్తేనే దేశంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అకాడమీ డెరైక్టర్ అరుణ బహుగుణతో కలసి సర్దార్ పటేల్ చిత్ర పటానికి పనగారియా నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు