ట్రైకార్‌ ద్వారా డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌

9 Aug, 2018 05:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌ కార్యక్రమాన్ని ట్రైకార్‌ (తెలంగాణ ట్రైబల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌) అందుబాటులోకి తెచ్చింది. దీనిలో భాగంగా డ్రైవింగ్‌లో నిష్ణాతులైన ఎస్టీ యువతకు రాయితీ పద్ధతిలో వాహనాలు ఇచ్చేం దుకు ఉపక్రమించింది. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో 500 మందికి దీని ద్వారా ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. బుధవారం దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు.

మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తు తం ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాల్లోని ఎస్టీలకే వర్తింపజేస్తున్నప్పటికీ.. త్వరలో గ్రామీణ ప్రాం తాల్లోని యువతకు వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ఇచ్చే వాహనాల ద్వారా క్యాబ్, ట్రాన్స్‌పోర్ట్‌ రంగంతో అనుసంధానమై ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగిరం చేయాలని, వచ్చే నెలాఖరులోగా లబ్ధిదారులందరికీ పూర్తిస్థాయిలో వాహనాలు పంపిణీ చేసేలా చర్య లు తీసుకోవాలని ట్రైకార్‌ యంత్రాంగాన్ని ఆదేశించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్‌దత్‌ ఎక్కా, కమిషనర్‌ క్రిస్టినా జెడ్‌ చోంగ్తు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు