బీఎడ్‌లో ప్రవేశాల షెడ్యూలు జారీ

29 Aug, 2017 02:55 IST|Sakshi

ఈ నెల 30న నోటిఫికేషన్‌..
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) కాలేజీల్లో బీఎడ్‌ ప్రవేశాల కోసం బుధవారం(30న) నోటిఫికేషన్‌ జారీ చేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన సోమవారం ప్రవేశాల కమిటీ సమావేశం మండలి కార్యాలయంలో జరిగింది.

ఈ సమావేశంలో షెడ్యూల్‌ను ప్రకటించారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి (ఎన్‌సీటీఈ) అఫిడవిట్లు దాఖలు చేసిన కాలేజీల జాబితా ఈ నెల 31 తర్వాత వెల్లడికానున్న నేపథ్యంలో ఆ తర్వాత ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించేలా షెడ్యూల్‌ను ఖరారుచేశారు.
 

ఇదీ షెడ్యూలు..
7–9–2017 నుంచి 13–9–2017 వరకు అర్హులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌
9–9–2017 నుంచి 16–9–2017వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం
17–9–2017న వెబ్‌ ఆప్షన్లలో మార్పులకు అవకాశం
20–9–2017న సీట్లు కేటాయింపు
25–9–2017లోగా కాలేజీల్లో చేరికలు, అదేరోజు నుంచి క్లాసులు ప్రారంభం.  
 

మరిన్ని వార్తలు