యోగాతో ఒత్తిడి దూరం

12 Apr, 2018 14:19 IST|Sakshi
ప్రాణాయామం చేస్తున్న యోగాగురు

జిల్లాకేంద్రంలో నిర్వహించిన యోగా శిబిరానికి రెండోరోజూ విశేష స్పందన లభించింది. బుధవారం మహిళలు, విద్యార్థులు భారీగా తరలివచ్చారు. నిత్యం గంటపాటు యోగా చేయడం ద్వారా ఒత్తిడికి దూరం కావచ్చని బాబా రాందేవ్‌ అన్నారు.

నిజామాబాద్‌ సిటీ(నిజామాబాద్‌అర్బన్‌): ఇంటిపనులతో బిజీగా గడిపే మహిళలకు ఎన్నో ఆరోగ్య సమస్యలుంటాయని, వీటిని అధిగమించాలంటే ప్రతిరోజు గంటపాటు యోగా చేయాలని బాబారాందేవ్‌ అన్నారు. యోగా శిబిరం రెండోరోజైన బుధవారం కొనసాగింది. సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరానికి పెద్దఎత్తున మహిళలు, విద్యార్థులు తరలివచ్చారు. రాందేవ్‌ బాబా చెప్పిన ఆసనాలను నేర్చుకున్నారు. ఈ సందర్భంగా రాందేవ్‌బాబా మాట్లాడుతూ.. యోగాసనాలు నియమానుసారంగా ఆచరిస్తే జీవితంలో ఎటువంటి రోగాలు దరి చేరవన్నారు. అనంతరం స్నేహ సొసైటీ విద్యార్థులు, వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన విన్యాసాలు అలరించాయి. దీంతో విద్యార్థులతోపాటు విన్యాసాలు నేర్పిన గురువులను బాబా రాందేవ్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఓం కారేశ్వర పీఠాధిపతి శ్రీ ప్రతాప దక్షిణమూర్తి(జహీరాబాద్‌ కోహిర్‌ పీఠం), స్వామి బ్రహ్మానంద సరస్వతి గురుకులం కామారెడ్డి హాజరయ్యారు. సీపీ కార్తికేయ సతీమణి, మేయర్‌ సుజాత, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సుమన, కార్పొరేటర్లు హాజరయ్యారు.  

మరిన్ని వార్తలు