యోగాతో రోగాల నుంచి విముక్తి

10 Apr, 2018 13:32 IST|Sakshi
నగరానికి వచ్చిన బాబా రాందేవ్‌ను కలిసిన ఎంపీ కవిత

2050 వరకు సంపూర్ణ ఆరోగ్య భారత్‌ లక్ష్యంగా కృషి

నాలో శ్వాస ఉన్నంతవరకు యోగా చేస్తా

విదేశీ వస్తువులు వద్దు , స్వదేశీ వస్తువులనే వాడండి 

బాబా రాందేవ్‌

రోగాల నుంచి విముక్తికి యోగానుఅలవర్చుకోవాలని యోగా గురువు బాబా రాందేవ్‌ అన్నారు. సోమవారం నగరంలోని ఆర్యసమాజ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను తొమ్మిదేళ్ల వయసప్పుడే యోగా నేర్చుకున్నానని తెలిపారు. 2050 సంవత్సరం కల్లా దేశంలో ఎవరూ రోగాలతో బాధపడకూడదన్నారు. పతాంజలి వస్తువుల విక్రయం ద్వారా వచ్చే లాభాల నుంచి ఆరోగ్యం, చదువు కోసం రూ. కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దళితులపై దాడులను ప్రతిఒక్కరు ఖండించాల్సిందేనని అన్నారు. జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు జరుగనున్న ఉచిత యోగా ధ్యాన శివిరంలో పాల్గొనవలసిందిగా ఎంపీ
కవితను బాబా రాందేవ్‌ ఆహ్వానించారు. కవిత నగరానికి వచ్చిన బాబా రాందేవ్‌ను కలిశారు. అనంతరం రాందేవ్‌ మంత్రి హరీష్‌రావుకు ఫోన్‌చేసి యోగా శివిరంలో పాల్గొనాలని కోరారు.

నిజామాబాద్‌ సిటీ(నిజామాబాద్‌అర్బన్‌): రోగాలతో బాధపడేవారికి యోగా ఒక అద్భుతమైన అవకాశమని, రోగాల నుంచి విముక్తికి యోగాను అలవర్చుకోవాలని బాబా రాందేవ్‌ అన్నారు. సోమవారం నగరంలోని ఆర్యసమాజ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను 9ఏళ్ల  వయస్సు నుంచే యోగా నేర్చుకున్నానని, తనలో శ్వాస ఉన్నంత వరకు యోగా చేస్తానని అన్నారు. జూలై 21 యోగా దినోత్సవం సందర్భంగా ప్రతిచోట మూడు రోజుల శివిరాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. జూలై 21 యోగా డే ప్రపంచం మొత్తం యోగా దినంగా పాటించటం గర్వించదగిన విషయమన్నారు. పతాంజలి వస్తువుల విక్రయించటం ద్వారా వచ్చే లాభాలను ఆరోగ్యం, చదువు కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. ఇందు లో తనతో పాటు పతాంజలి బాలకృష్ణ ఒక్క రూపాయి వేతనం తీసుకోకుండా పనిచేస్తున్నామన్నారు. సమావేశంలో యోగా వైద్యుడు జయదీప్‌ ఆర్యా, భారత్‌ స్వభిమాన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్, యువ భారత్‌ అధ్యక్షుడు సచిన్, యోగా శిక్షకులు కృపాకర్, మంజుశ్రీ, శివకుమార్, శివుడు పాల్గొన్నారు.    

దళితులపై దాడులనుఖండించాల్సిందే..
సమాజంలో దళితులు ఒక భాగమని వారిపై జరుగుతున్న దాడులను ప్రతిఒక్కరు ఖండించాల్సిందేనని బాబా రాందేవ్‌ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఈ నెల 10 నుంచి 12 వరకు నిర్వహించే ఉచిత యోగా శిక్షణ, యోగా చికిత్స శివిరం సందర్భంగా సోమవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి విచ్చేసిన బాబా రాందేవ్‌ ఆర్యసమాజంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా దేశంలో దళితులు తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళన చేస్తున్నారు. వారికి ఎట్టి పరిస్థితులో అన్యాయం జరుగరాదన్నారు. దీనిని సాకుగా కొందరు నేతలు, ఇతరులు హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దన్నారు. దళిత సమాజం సమన్వయం పాటించాలని ఆయన కోరారు. లక్ష మంది విద్యార్థులకు యోగాపై శిక్షణ ఇచ్చేందుకు ఢిల్లీలో యూనివర్సిటీని స్థాపించనున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు