తల్లికి ‘మహమ్మారి’ సోకిందని..

22 Apr, 2015 01:30 IST|Sakshi
శిశువును పడేసింది ఈ బావిలోనే...(ఇన్ సెట్లో) పసికందు

బాబును బావిలోపడేసిన అమ్మమ్మ, పెద్దమ్మ
 
గండేడ్: తల్లికి ప్రాణాంతకమైన వ్యాధి సోకిందనే అనుమానంతో ఓ పసికందును అయినవారే చం పేందుకు యత్నించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా గండేడ్ మండల పరిధిలోని రంగారెడ్డిపల్లి సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దోమ మండలం దాదాపూర్ వాసి వడ్డె అంజిలమ్మకు సంతానం లేకపోవడం తో తన చెల్లెలి ఇద్దరు కూతుళ్లను పెంచుకుంది. వారిలో చిన్న కూతురుకు కుల్కచర్ల మండలం కల్మన్‌కల్వ గ్రామానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకుంది.  వీరంతా నగరంలోని బోరబండకు వలస వెళ్లారు. ఇటీవల  ఆ యువకుడు భార్య ను వదిలేసి స్వగ్రామానికి వెళ్లిపోయాడు.

గర్భం తో ఉన్న ఆమె నాలుగు రోజుల క్రితం నగరంలోని ఓ ఆస్పత్రిలో బాబుకు జన్మనిచ్చింది. తల్లికి ప్రాణాంతకవ్యాధి ఉండడంతో బిడ్డకు పాలు ఇవ్వలేదు. దీంతో కుటుంబీకులంతా చర్చించుకొని పసికందును చంపేయాలని నిర్ణయించుకున్నారు. అమ్మమ్మ అంజిలమ్మ, పెద్దమ్మ రత్నమ్మలు బాబుని తీసుకొని మంగళవారం గండేడ్ మండలం రంగారెడ్డిపల్లి శివారులో ఓ నీళ్లులేని  బావిలో పడేసి వెళ్తుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. శిశువును ఐసీడీఎస్ అధికారి దివ్య సహాయంతో 108 వాహనంలోఆసుపత్రికి తరలించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు