గరంగరంగా బీఏసీ

8 Mar, 2015 04:10 IST|Sakshi

హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల తొలి రోజున గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామంపై స్పీకర్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. ఉభయసభలను ఉద్దేశించి శనివారం గవర్నర్ నరసింహన్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ వాయి దా పడింది. ఆ తర్వాత దాదాపు గంట న్నరసేపు బీఏసీ సమావేశం జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ముందు జాతీయగీతం ఆలపిస్తుండగా అనుచితంగా ప్రవర్తించిన సభ్యులపై చర్య తీసుకోవాలన్న ప్రతిపాదనతో ఈ భేటీ మొదలైనట్లు సమాచారం. గంట పాటు ఇదే అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. సభలో జాతీయగీతం ఆలపిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే లు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి టేబు ళ్లు ఎక్కి గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై స్పీకర్ చర్య తీసుకోవాలన్న వాదన బీఏసీలో బలంగా వినిపించింది. అయి తే తమ సభ్యులపై దాడి చేసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని, అది తేలాకే మరో అంశాన్ని చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. ఈవివాదాన్ని ముగించేందుకు ముం దుగా ఫ్లోర్‌లీడర్లకు వీడియో దృశ్యాలను చూ పించాలని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ సభ్యులు డిమాండ్ చేశారు.

కాగా, జాతీయగీతాన్ని అవమానపరిచిన సభ్యులు బేషరతు గా క్షమాపణ చెప్పాలని, లేదంటే వారిని సస్పెండ్ చేయాలని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేసినట్లు సమాచారం. కాగా, వీడియో దృశ్యాలను చూ పించే విషయంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు చెప్పగా.. స్పీకర్‌పై తమకు నమ్మకం లేద ని టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎర్ర బెల్లి దయాకర్‌రావు అన్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యాయని ఆయన నిరసన తెలిపినట్లు సమాచారం. మంత్రి తలసానిపై అనర్హత వేటు వేసే దాకా తమ నిరసన కొనసాగుతుందని తేల్చి చెప్పినట్లు తెలిసింది. కాగా, సాంకేతిక అంశాలను చూపెట్టి పార్టీలపై ఒత్తిడి పెంచొద్దని, సమావేశ తేదీలను హడావుడిగా ఎందు కు నిర్ణయించారని బీజేపీఎల్పీ నేత లక్ష్మణ్ పేర్కొన్నట్లు తెలిసింది.

26, 27 తేదీల్లో ద్రవ్య వినిమయ బిల్లు
బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరు కాలేదు. సమావేశం మొదలవడానికి ముందే ఆయన స్పీకర్‌ను కలిసి మాట్లాడి వెళ్లిపోయారు. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 27వ తేదీ దాకా సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై 9, 10 తేదీల్లో చర్చ ఉంటుంది. 11వ తేదీన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ 2015-16 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. 12వ తేదీన సెలవు ప్రకటించారు. 13, 14, 16 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. 17వ తేదీన ఆర్ధిక మంత్రి సమాధానం, 18, 19, 20, 23, 24, 25 తేదీల్లో ఆరు రోజులపాటు పద్దులపై చర్చ, ఓటింగ్ ఉంటాయి. 26న ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెడతారు.

అదే రోజు ప్ర భుత్వ బిల్లులు, ఆర్డినెన్సులను ప్రవేశ పెడతారు. 27న శాసనమండలిలో ద్రవ్య విని మయ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. 15, 21, 22 తేదీలను సెలవుగా నిర్ణయించారు. ఒక వేళ విపక్షాలు పట్టుబడితే మరో రెండు రోజుల పాటు సభను జరపడానికి ప్రభుత్వానికి ఎ లాంటి అభ్యంతరం లేదని మంత్రి హరీశ్‌రావు అన్నట్లు సమాచారం. కనీసం ఐదు రోజులు వర్కింగ్ లంచ్‌తో సభా సమయాన్ని పొడి గించడానికి మంత్రి సుముఖత తెలిపినట్లు తెలిసిం ది. వాయిదా తీర్మానాలను ప్రశ్నోత్తరాల తర్వాతనే చేపట్టాలని కూడా నిర్ణయించారు. సమావేశాల ప్రత్యక్ష ప్రసారానికి పాత పద్ధతినే అవలంభిస్తున్నట్లు హరీశ్ పేర్కొన్నారు. ఇక ఉద యం 9.30 గంటలకే సమావేశాలు మొదలుపెట్టాలని విపక్షాలు కోరడంతో దీనిపై నిర్ణయాన్ని స్పీకర్ పెండింగులో పెట్టారు. ఈ భేటీ లో సీఎల్పీ నుంచి మల్లు భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి, సీపీఎం నుంచి సున్నం రాజయ్య, సీపీఐ నుంచి రవీంద్రకుమార్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు