ఈ నెల 22న బక్రీద్‌

14 Aug, 2018 03:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రకటించిన నెలవంక నిర్ధారణ కమిటీ

సాక్షి, హైదరాబాద్‌: బక్రీద్‌ పండుగను ఈ నెల 22వ తేదీన జరుపుకోవాలని రుహియతే హిలాల్‌ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్‌పాషా ఖుత్తారీ తెలిపారు. సోమవారం మోజంజాహీ మార్కెట్‌లోని కమిటీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమిళనాడులోని మదురైలో నెలవంక కనబడినట్లు సమాచారం కాస్త ఆలస్యంగా అందినట్లు పేర్కొన్నారు. ఇస్లామియా కేలండర్‌ ప్రకారం ఏటా జిల్‌ హజ్‌ నెలలో నెలవంక దర్శనం ఇచ్చిన పదవ రోజు ముస్లింలు బక్రీద్‌ పండుగ జరుపుకుంటారని అన్నారు. అలాగే ఈ ఏడాదీ నెలవంక దర్శనమిచ్చిన పదవ రోజైన ఆగస్టు 22న పండుగ జరుపుకోవాలని సూచించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు