లంబో ‘ధర’ం

9 Sep, 2014 02:22 IST|Sakshi

* వేలం పాటలో రికార్డు స్థాయి ధర పలికిన గణపతి లడ్డూలు

హైదరాబాద్: భక్తుల కొంగుబంగారం.. లంబోదరుని మహా ప్రసాదం. సోమవారం రాజధాని వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వేలం పాటల్లో గణపతి లడ్డూలు రికార్డు స్థాయి ధర పలికాయి. చారిత్రక ప్రసిద్ధి పొందిన బాలాపూర్ వినాయకుని లడ్డూను అదే ప్రాంతానికి చెందిన సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి రూ.9.50 లక్షలకు దక్కించుకున్నారు.

లడ్డూల వేలంలో బాలాపూర్ గణపతితో పోటీపడే బడంగ్‌పేట విఘ్నేశ్వరుని లడ్డూ ఈసారి అమాంతం తగ్గిపోయింది. గతేడాది రూ.6.30 లక్షలు పలికిన ఈ లడ్డూ ధర ఈసారి రూ.4.05 లక్షలకు పడిపోయింది. దీనిని బడంగ్‌పేట నగర పంచాయతీ అధ్యక్షుడు (టీఆర్‌ఎస్) కర్రె కృష్ణ దక్కించుకున్నారు. లడ్డూని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు అంకితమిస్తున్నట్టు కృష్ణ ప్రకటించారు. ఈసారి గణపతి లడ్డూలను దక్కించుకునేందుకు ముస్లింలు సైతం ముందుకు రావడం విశేషం.

మరిన్ని వార్తలు