ప్రచార కార్యక్రమంలా మారొద్దు

11 Jul, 2017 02:07 IST|Sakshi
ప్రచార కార్యక్రమంలా మారొద్దు

హరిత హారంపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్‌: ‘కాలుష్యాన్ని అరికట్టాలంటే పచ్చదనాన్ని పెంపొందించడమే ఏకైక మార్గం. తెలంగాణ ప్రభుత్వం హరితహారాన్ని బాధ్యతగా తీసుకోవడం శుభపరిణామం. కానీ ఇది ప్రచార కార్యక్రమంలా మారొద్దు’అని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం భవిష్యనిధి ప్రాంతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘క్షేత్రస్థాయిలో కార్మికులు, ప్రజలు భాగస్వాములను చేస్తేనే సత్ఫలితాలు వస్తాయి.  కార్మికుల ఆరోగ్య భద్రత విషయంలో నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలు కవిత తనకు ఎలాంటి లేఖ ఇవ్వలేదని చెప్పారు. అయినప్పటికీ నిజామాబాద్‌లో 50 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. ఆమె తనతో గొడవ పడాల్సిన అవసరం లేదని, సమస్య ఉంటే కార్యాలయానికి రావాలని, చాయ్‌ ఇచ్చి మరీ సమస్యను పరిష్కరిస్తానని దత్తాత్రేయ అన్నారు.

మరిన్ని వార్తలు