అందరిని కలపడమే అలయ్‌ బలయ్‌: దత్తాత్రేయ

28 Sep, 2017 14:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌కుమార్‌ హాజరు కానున్నట్లు బీజేపీ సీనియర్‌ నాయకుడు బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అక్టోబర్‌ ఒకటో తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్లో 13 వ అలయ్‌ బలయ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

అందరిని కలపడమే అలయ్‌ బలయ్‌ లక్ష్యమన్నారు. రాజకీయ విబేధాలున్నా మనుషులుగా అందరూ ఒక్కటిగా ఉండాలి. ఇకపై తెలంగాణ వ్యాప్తంగా అలయ్‌ బలయ్‌ నిర్వహిస్తామన్నారు.

మరిన్ని వార్తలు