తెలంగాణ రైతులను ఆదుకోండి

30 Oct, 2014 02:01 IST|Sakshi
తెలంగాణ రైతులను ఆదుకోండి

 కేంద్ర వ్యవసాయ మంత్రికి ఎంపీ దత్తాత్రేయ విజ్ఞప్తి
 
 సాక్షి, న్యూఢిల్లీ: గిట్టుబాటు ధరలు లేకపోవడం, మరో పక్క తుపాన్లతో పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 320 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వీరిలో ఎక్కువ మంది పత్తి రైతులే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పత్తిరైతులకు లబ్ధి చేకూరేలా అదనపు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం ఢిల్లీలో మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు, పౌరవిమానయాన మంత్రి అశోక్‌గజపతిరాజు, పీఎంఓ కార్యాలయ మంత్రి జితేంద్రసింగ్‌తో భేటీ అయ్యారు. రైతుల ఆత్మహత్యలపై అధ్యయనానికి కమిటీ వేస్తామని మంత్రి రాధామోహన్‌సింగ్ హామీ ఇచ్చారని అనంతరం మీడియాకు తెలిపారు.
 

మరిన్ని వార్తలు