బీజేపీ ర్యాలీలో స్పల్ప ఉద్రిక్తత

15 Oct, 2019 18:00 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : ఆర్టీసీ కార్మికల సమ్మెకు సంఘీభావంగా జిల్లాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో స్పల్ప ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీలో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతో సహ పలువురిని పోలసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అరెస్టును నిరసిస్తూ ఎంపీని స్టేషన్‌కు తరలించకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం ఎంపీ బండి సంజయ్‌ మాట్లాడుతూ.. బీజేపీ శాంతియుతంగా ర్యాలీని నిర్వహిస్తుంటే మధ్యలో అడ్డుకొని అరెస్టు చేయడం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక.. అహంకారపూరిత పాలనకు నిదర్శనమన్నారు.

అరెస్టులకు, కేసులకు తాము భయపడమని, సీఎం కేసీఆర్‌ స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా అరెస్టులు ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ మండిపడ్డారు. కావాలనే ప్రభుత్వం నిరసన ర్యాలీని అడ్డుకుందని, ఆర్టీసీ కార్మికులకు ఏం జరిగినా సీఎం కేసీఆర్‌, హోంమంత్రి బాధ్యత వహించాల్పి ఉంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు