ట్యాంకుపైకి ఎక్కి దూకుతానంటూ...

7 Sep, 2018 17:08 IST|Sakshi
ట్యాంకుపైకి ఎక్కిన బ్యాంకు సేవ కేంద్రం ఏజెంట్‌ వెంకట్‌, కిందకు దిగిరావాలని కోరుతున్న గ్రామస్తులు

చిన్నశంకరంపేట(మెదక్‌) : మండలంలోని ఖాజాపూర్‌లో బ్యాంకు సేవ కేంద్రం ఏజెంట్‌గా పనిచేస్తున్న వెంకట్‌ వాటర్‌ ట్యాంకుపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటున్నానని కాసేపు హల్‌చల్‌ చేశారు. గురువారం ఉదయం ఖాజాపూర్‌ మధిర గ్రామమైన కుమ్మరిపల్లిలో వెంకట్‌ ట్యాంకుపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని అతడిని సముదాయించారు. చిన్నశంకరంపేట పోలీస్‌లకు కూడా సమాచారం అందించడంతో వారు కూడ అక్కడికి చేరుకుని ట్యాంకుపై ఉన్న వెంకట్‌కు నచ్చజెప్పి కిందకు దించారు.

తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా వారం రోజుల క్రితం గ్రామంలోని బ్యాంకు సేవ కేంద్రంతో ఖాతాదారుల డబ్బులు తన ఖాతాలోకి మల్లించుకున్న సంఘటన బయటపడడంతో గ్రామస్తులు ఎవరి డబ్బులు వారికి చెల్లించాలని అతడిని హెచ్చరించారు. అలాగే కొందరికి చెల్లించడంతో పాటు మరి కొంత మందికి చెల్లించేందుకు గడువు కోరిన వెంకట్‌ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వకుండ బెదిరించేందుకు ఈ డ్రామకు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. గురువారం నాడు మరో సారి గ్రామంలో మాట్లాడుదామని చెప్పడంతోనే ఇలా చేశాడని తెలిపారు.

ఈ విషయంపై విచారణ జరిపేందుకు నార్సింగి ఎస్‌బీఐ మేనేజర్‌ దీపిక ఖాజాపూర్‌ గ్రామానికి చేరుకున్నప్పటికి బ్యాంకు సేవ కేంద్రానికి తాళం ఉండడంతో పాటు వెంకట్‌ అందుబాటులో ఉండకపోవడంతో ఆమె వెనక్కి వెళ్లారు. విచారణ జరిపి అతడిపై చర్యలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇంటర్‌ ఫలితాలపై కమిటీ

గొడవ ఆపడానికి వెళ్లిన పోలీసులపై దాడి

కాంగ్రెస్‌లో మిగిలేది ‘ఆ ముగ్గురే’

డీసీసీలకు ఏ-ఫారంలు అందజేసిన టీపీసీసీ

టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనానికి రంగం సిద్ధం!

మోగిన నగారా

పెండింగ్‌ పనులు పూర్తి  చేయండి: మల్లారెడ్డి 

సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ భేష్‌: ఆర్‌.సి.శ్రీవాత్సవ

వ్యర్థాల నియమావళి బాధ్యత పీసీబీదే

ఆ ఎన్నికలను వాయిదా వేయండి

లీకేజీల పరిశీలనకు వైజాగ్‌ డైవర్లు 

పరిషత్‌ పోరుకు మోగిన నగారా

రెండ్రోజులపాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు 

ఈవీఎంలను హ్యాక్‌ చేయలేం!

రెండు తలలతో శిశువు

పొత్తులపై నిర్ణయాధికారం జిల్లా కమిటీలకే

‘విద్యుత్‌’ విభజనపై మళ్లీ ‘సుప్రీం’కు! 

రైతులు అమ్మిన పంటకు తక్షణ చెల్లింపులు

రాజధానిలో మళ్లీ ఐసిస్‌ కలకలం

న్యాయవ్యవస్థకు ఆటుపోట్లు సహజమే!

ఫస్ట్‌ ఇయర్‌లో టాప్‌ సెకండ్‌ ఇయర్‌లో ఫెయిల్‌

శిశువు తరలింపు యత్నం..

నలుగురు ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్య

ఇంటర్‌ బోర్డు ఫెయిల్‌

కారెక్కుతున్న మరో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు!

జూ పార్క్‌లో కూలిన భారీ వృక్షం.. మహిళ మృతి

హైకోర్టులో ఘనంగా శతాబ్ది ఉత్సవాలు

అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర పంటనష్టం

‘కోడి గుడ్డు మీద ఈకలు పీకే మీ బుద్ధి మారదా?’

అరుదైన ఘటన.. కోటిలో ఒకరికి మాత్రమే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడు రిషి, రైటర్‌ స్వాతిల నిశ్చితార్థం

అక్కడా మీటూ కమిటీ

మరోసారి జోడీగా...

కాపాడేవారెవరు రా?

రాణి పూంగుళలి

గ్యాంగ్‌ వార్‌