బాసర: రేపటి నుంచిఅర్జిత సేవలు బంద్‌

20 Mar, 2020 09:09 IST|Sakshi

సాక్షి, బాసర(నిర్మల్‌): కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలు, మాల్స్‌, థియోటర్లు, రెస్టారెంట్లతో పాటు ప్రముఖ దేవాలయాలను కూడా మూసివేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న(గురువారం) వేములవాడ రాజన్న ఆలయం మూసివేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో రేపటి(శనివారం) నుంచి అర్జిత సేవలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ శుక్రవారం ఆదేశాలు జారి చేసింది. (రాజన్న ఆలయం మూసివేత)

ఇక రేపటి నుంచి భక్తులు ఆలయాలని రావోద్దని  ఆలయ అధికారులు సూచించారు. ఆలయంలో జరిగే అక్షరాభ్యాసం, కుంకుమార్చన వివిధ అర్జిత సేవలు నిలిపివేయాలని కూడా ఆదేశాలు జారి చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కాగా కరోనా వైరస్‌ దృష్టిలో పెట్టుకుని భక్తులు తమకు సహకరించాలని విజ్ఙప్తి చేశారు. ఇక ఆలయంలో వేకువ జామునే జరిగే సరస్వతి అమ్మవారి అభిషేకం, హారతి పూజలు యధావిధిగా జరుగుతాయని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు