గంగమ్మ మెరిసే.. గౌరమ్మ మురిసే

10 Oct, 2016 06:58 IST|Sakshi
గంగమ్మ మెరిసే.. గౌరమ్మ మురిసే

ట్యాంక్‌బండ్‌పై మిన్నంటిన సద్దుల బతుకమ్మ సంబురం
 
 సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ తీరాన సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్ని అంటింది. ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ సంస్కృతీ వైభవం ఘనంగా ఆవిష్కృతమైంది. తీరొక్క పూల పండుగ చివరి రోజైన ఆదివా రం ఆడపడుచులు బతుకమ్మ ఆడి పులకించి పోయారు. వర్షంలోనూ ఉత్సాహంగా గౌరీదేవిని అర్చించారు. ఇరవై ఐదు వేల మందికి పైగా మహిళలు దారి పొడవునా బతుకమ్మలు చేతబట్టి ట్యాంక్‌బండ్‌పైకి వరుసకట్టగా... రహదారులు పూదారులై... సంప్రదాయ సిరి విరిసి భాగ్యనగరి పరవశించింది. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గౌరీదేవిని.. సద్దులతో సాగర ఒడికి చేర్చారు. ‘మాయమ్మ.. శ్రీదేవి పోయిరావమ్మా’ అంటూ సాగనంపారు. జీహెచ్‌ఎంసీ, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చే శారు. హుస్సేన్‌సాగర్‌లో బోట్‌లపై నుంచి పేలిన బాణాసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిరిజనుల సంప్రదాయ నృత్యాలు అలరించాయి. అచ్చతెలుగు సంప్రదాయ దుస్తుల్లో విదేశీ మహిళలు బతుకమ్మ ఆడిపాడారు.

 నంబర్ వన్ పండుగ...: బతుకమ్మ సంబరాలకు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, చందూలాల్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం తదితరులు హాజరయ్యారు. ప్రపంచ నంబర్ వన్ పండుగగా తెలంగాణ బతుకమ్మ ఎదుగుతోందని నాయిని అన్నారు. అమెరికా, దుబాయ్, మలేసియా, ఆస్ట్రేలియాలో ఎన్‌ఆర్‌ఐలు సైతం సంబరాలను వైభవంగా నిర్వహిస్తూ... తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తున్నారన్నారు.
 
 ప్రతిష్ట పెరిగింది: హరీశ్
 మరోవైపు కూకట్‌పల్లిలో బతుకమ్మ వేడుక వైభవంగా జరిగింది. ఆటపాటల అనంతరం ఐడీఎల్ వద్ద నియోజకవర్గ స్థారుు బతుకమ్మ పోటీలను స్థానిక శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. గుజరాతీలు, మళయాళీలు, తెలంగాణ మహిళలు దాండియా, ఓనం, బతుకమ్మ ఆడి ఆకట్టుకున్నారు. భారీ బతుకమ్మల ప్రదర్శన నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి టి.హరీశ్‌రావు మాట్లాడుతూ... బతుకమ్మతో తెలంగాణ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి వల్ల పారిశ్రామికవేత్తలు, ఐటీ కంపెనీలు, పెట్టుబడిదారులు అందరూ నగరం ైవె పే మొగ్గు చూపుతున్నారన్నారు. ఇక్కడ కృత్రిమ బతుకమ్మలుంటాయనుకున్నానని.. కానీ పూర్తిగా పూలతో పేర్చిన బతుకమ్మలు ఇంతపెద్ద స్థారుులో కనిపిస్తుంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు. మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు