పుడమి పూసింది

21 Oct, 2015 03:53 IST|Sakshi
పుడమి పూసింది

బతుకమ్మకుంట (జనగామ) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుక మ్మ పండుగను నిర్వహించుకోవడానికి తెలంగాణ ప్రజలు గర్వపడాలని సినీగేయ రచ యిత, స్వచ్ఛ భారత్  ప్రచార కర్త సుద్దాల అశోక్ తేజ అన్నారు. పట్టణంలోని బతుకమ్మకుంటలో మంగళవారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్‌తేజ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ పేదల పండుగని, తంగే డు, గునుగు, ముత్యాల పూలు తెలుగింటి ఆడపడుచులకు పసుపు కుం కుమలతో సమానమని ఆయన అభివర్ణించారు. జనగామలో సద్దుల బతుకమ్మలో పాల్గొనడం తనకు పుట్టింటికి వచ్చినంత సంతోషాన్ని కలిగించిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
 
 సీఎం కేసీఆర్‌లో కవి హృదయం
 ముఖ్యమంత్రి కేసీఆర్‌లో కళాకారుడితో పాటు కవి హృదయం దాగి ఉం దని సుద్దాల అశోక్‌తేజ  అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పార్టీ స్థాపిం చక ముందే పాటలు రాయడం మొదలు పట్టామని, కేసీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు చేశారు. గుంటూరు జిల్లాలో గుంట జాగ అడిగినమా.. అనే పాటకు కేసీఆరే స్ఫూర్తి కలిగించాడన్నారు. రచయితగా తన 22ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో తెలంగాణ ఉద్య పాటలతో పాటు అమరవీరుల త్యాగాలను స్మరించుకునే పాటలు మరువలేనివన్నారు. ‘పొద్దు తిరుగుడు పువ్వు.. పొద్దును ముద్దాడే... తొలి పొద్దును ముద్దా డే... అడవిలో వెన్నెలమ్మ ఆకును ముద్దాడే.. చిగురాకును ముద్దాడే.. అంటూ ఆలపించిన పాట మహిళా లోకాన్ని ఆలోచింపజేసింది.
 

మరిన్ని వార్తలు