పల్లెలు.. పూల ముల్లెలు

24 Sep, 2014 00:13 IST|Sakshi

 బతుకమ్మ సంబురాలకు జిల్లా ముస్తాబైంది. పల్లెలు, పట్టణాల్లో పండుగ సందడి నెలకొంది. బుధవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైన ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగియనుంది. సంప్రదాయ వస్త్రధారణలో ఆడపడుచులు తొమ్మిది రోజుల పాటు ఆటపాటల్లో మునిగితేలనున్నారు. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన బతుకమ్మ వేడుకకు జిల్లా యంత్రాంగం  కూడా విస్తృత ఏర్పాట్లు చేసింది.
 

మరిన్ని వార్తలు