కలెక్టరేట్‌లో బతుకమ్మ సందడి

17 Oct, 2018 11:19 IST|Sakshi
బతుకమ్మ ఆడుతున్న కలెక్టర్‌ హరిత, కలెక్టరేట్‌ ఉద్యోగినులు

వరంగల్‌ రూరల్‌: కలెక్టరేట్‌ ఆవరణలో బతుకమ్మ సంబురాలను మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ ముండ్రాతి హరిత బతుకమ్మ తీసుకొచ్చి సంబురాలను ప్రారంభించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది  బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. కలెక్టర్‌ హరిత ‘నిర్మల.. ఓ నిర్మల’ పాటకు  కోలాటంలో పాల్గొన్నారు. డీఆర్‌డీఏ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఈజీఎస్, జిల్లా సంక్షేమ శాఖ, ఐసీడీఎస్‌ విభాగాల ఆధ్వర్యంలో బతుకమ్మలను ప్రదర్శించారు.

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణారెడ్డి మహిళా ఉద్యోగులను ఉత్సాహపరుస్తూ నృత్యాలు చేసి అలరించారు. జేసీ రావుల మహేందర్‌రెడ్డి, డీఆర్వో భూక్యా హరిసింగ్, పరకాల ఆర్డీఓ ఎల్‌.కిషన్, డీటీఓ శ్రీనివాసకుమార్, డీపీఆర్వో బండి పల్లవి, డీఈఓ కె.నారాయణ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్‌ హరిప్రసాద్, తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం నాయకులు సయ్యద్‌ హసన్, మురళీధర్‌ రెడ్డి, టీజీఏ జిల్లా నాయకులు జగన్‌ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రథమ బహుమతిని డీఆర్‌డీఏ, ద్వితీయ బహుమతి ఐసీడీఎస్, తృతీయ బహుమతి కలెక్టరేట్‌ ఉద్యోగులు పేర్చిన బతుకమ్మ గెల్చుకున్నాయి. ఈ సందర్భంగా ఆయా శాఖల ఉద్యోగినులకు కలెక్టర్‌ హరిత జ్ఞాపికలు అందజేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా