చీరలు వస్తున్నాయ్‌!

28 Aug, 2019 10:20 IST|Sakshi
కందుకూరు మండలం కొత్తూరు గోదాముకు చేరుకున్న బతుకమ్మ చీరలు

ఇప్పటికే జిల్లాకు చేరిన 2.93 లక్షల బతుకమ్మ చీరలు

18 ఏళ్లు నిండి.. రేషన్‌కార్డులో పేరున్న ప్రతి మహిళకు అందజేయనున్న అధికారులు

సాక్షి, రంగారెడ్డి : బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు యంత్రాంగం  సిద్ధమవుతోంది. రెండేళ్లుగా మహిళలకు అందజేస్తున్న విషయం తెలిసిందే. మూడో ఏడాది కూడా పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. చీరలను జిల్లాకు చేర్చుతోంది. వీటిని మొయినాబాద్, కందుకూరు మండలం కొత్తూరులోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ) గోదాముల్లో అధికారులు భద్రపరుస్తున్నారు. ఈ ఏడాది సుమారు ఐదు లక్షల చీరలు మహిళలకు అందజేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. వచ్చేనెల ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండి.. ఆహార భద్రత కార్డు (రేషన్‌)లో పేరున్న ప్రతి మహిళకు ఒక చీర చొప్పున పంపిణీ చేస్తారు. రేషన్‌ కార్డుల ప్రకారం జిల్లాలో గతేడాది 6.59 లక్షల మంది మహిళలు ఉండగా.. వీరిలో 4.78 లక్షల మంది చీరలు అందుకున్నారు. మిగిలిన వారు తీసుకోలేదు. గతంతో పోల్చితే ఈసారి చీరలు తీసుకునే లబ్ధిదారుల సంఖ్య ఐదు శాతం పెరుగుతుందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు జిల్లాకు 2.93 లక్షల చీరలు వచ్చాయి. మిగిలిన చీరలు మరో వారం రోజుల్లో చేరుకుంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇంకా ఖరారుకాని విధివిధానాలు.. 
బతుకమ్మ సంబరాలు వచ్చేనెల చివరి వారంలో ప్రారంభం కానున్నాయి. ఈలోగా మండలాలకు చీరల చేరవేత, లబ్ధిదారులకు పంపిణీ ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలు రానున్నాయి. గోదాంల నుంచి ప్రతి మండలానికి తరలించేందుకు వీలుగా రూట్‌ ఆఫీసర్లను నియమించనున్నారు. అక్కడి నుంచి గ్రామాల్లోని రేషన్‌ దుకాణాలకు చేరుస్తారు. రాష్ట్ర స్థాయిలో చీరల పంపిణీకి ప్రభుత్వం తేదీలు ఖరారు చేయనుంది. నిర్దేశిత తేదీల్లో రేషన్‌ దుకాణాల్లో  చీరలను పంపిణీ చేయనున్నారు. సిరిసిల్లలో పవర్‌లూంలో వీటిని తయారు చేస్తున్నారు. కాగా, గతంలో రెండుసార్లు పెద్దగా నాణ్యత లేవని పూర్తిస్థాయిలో లబ్ధిదారులు తీసుకోలేదు. ఈ సారి ఎలా ఉంటాయో వేచి చూడాలి. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాంగ్రెస్‌ పాదయాత్ర భగ్నం     

పోలీసులకు బాడీ వార్న్‌ కెమెరాలు

ఎన్నేళ్లకు జలకళ

ఓరుగల్లు ఆతిథ్యం

అవినీతిని ఆధారాలతో బయటపెడతా  

ఆదిలాబాద్‌లో ఢీ అంటే ఢీ

యురేనియం కోసమే మరోమారు చక్కర్లు కొట్టిన హెలికాప్టర్‌?

దంపతులు ఇద్దరూ ఒకే రీతిలో..

మినీ గోవాగా ఖ్యాతిగాంచిన గ్రామం 

గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ పనులు వడివడిగా..!

ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలి 

హుండీ దందా గుట్టురట్టు 

ఉల్లి ‘ఘాటు’! 

'చిరుత పులి' రోజుకొకటి బలి! 

అభ్యంతరాలన్నీ పరిశీలించాకే మున్సి‘పోల్స్‌’

‘కేంద్రం’ నుంచే వివరణ తీసుకోండి!

ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరం

సర్కారు బడుల్లో ట్యూషన్‌

ఒకే దెబ్బ... రెండు పిట్టలు

కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ వినూత్న ప్రయోగం

సాయంత్రం ఓపీ.. 

కలెక్టర్ల ఓరుగల్లు బాట! 

ఎయిమ్స్‌ కళాశాల ప్రారంభం

ఎలా వచ్చాడో.. అలాగే వెళ్ళాడు..

‘క్యూనెట్‌’పై ఈడీ

బడిని గాడిన..

ప్రభుత్వ శాఖలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి : కేసీఆర్‌

అడవిలో ఉండటం వల్లే కొంత ఆలస్యం : మంత్రి

‘కన్నడ నటుడిని చూసి కేసీఆర్‌ నేర్చుకోవాలి’

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అర్జున్‌ మేనల్లుడి పొగరు

తరగతులకు వేళాయె!

నెయిల్‌ పాలిష్‌... మస్త్‌ ఖుష్‌

బేబీ బాయ్‌కి జన్మనివ్వబోతున్నాను

మా ఆయుధం స్వార్థత్యాగం

క్లాష్‌ వస్తే నిర్మాతలే నష్టపోతున్నారు