బతుకమ్మ చీరలు సిద్ధం

12 Sep, 2017 08:01 IST|Sakshi
బతుకమ్మ చీరలు సిద్ధం

రెండు నెలల్లో 3.75 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి
సిరిసిల్ల:
తెలంగాణ ఆడపడుచుల కోసం బతుకమ్మ చీరలు సిద్ధమయ్యాయి. బతు కమ్మ కానుకగా చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం పనిలో పనిగా రాజన్న సిరిసిల్ల జిల్లా నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ చీరల ఆర్డర్లు ఇచ్చింది. ఈ ఏడాది జూన్‌ 15న బతుకమ్మ చీరల ఆర్డర్లను రాష్ట్ర జౌళిశాఖ అధికారులు ఇవ్వగా.. నూలు కొనుగోలు చేసి జూన్‌ 30న వస్త్రోత్పత్తిని ప్రారం భించారు. 52 మ్యాక్స్‌ సంఘాలు, మరో 312 చిన్న తరహా కుటీర పరిశ్రమలు, 10,200 మంది కార్మికులు, 1,852 మంది ఆసాములు రేయింబవళ్లు శ్రమించి 3.75 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేశారు.

ఇంకా మర మగ్గాలపై బతుకమ్మ చీరల వస్త్రం ఉంది. కానీ అధికారులు మంగళవారం వర కు బతుకమ్మ చీరల వస్త్రాన్ని సేకరించారు. దీంతో సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర జౌళిశాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో సిరిసిల్ల నేతన్నల కు నేరుగా రూ.30 కోట్ల మేరకు ఉపాధి కూలీ రూపంలో లభించింది. ఒక్కో కార్మికుడికి నెలకు రూ.16,000 మేరకు లభించాయి. సాంచాల మీద ఉన్న బట్టను ఇచ్చేందుకు మరోవారం రోజుల గడువు ఇవ్వాలని సిరిసిల్ల నేతన్నలు కోరుతున్నారు. కానీ, అధికారులు వస్త్రం కొనుగోళ్లను ఆపివేశారు.

మరిన్ని వార్తలు