సమగ్ర సర్వే గణాంకాలు బయటపెట్టండి : విక్రమార్క

13 Jul, 2018 20:41 IST|Sakshi
భట్టి విక్రమార్క (పైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : మాజీ ప్రధాని  రాజీవ్‌ గాంధీ గ్రామ స్వరాజ్యం కోసం తీసుకువచ్చిన చట్టాన్ని అమలు చేయకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఓ కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కొన్ని సాకులు అడ్డుపెట్టుకుని పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఓబీసీలకు రిజర్వేషన్ల్‌ అంశంలో అన్యాయం జరిగేలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని భట్టి ఆరోపించారు.

ఓబీసీల సరైన గణన చేయమని కోర్టు చెప్పిందని, సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ డబ్బుతో సమగ్ర కుటుంబ సర్వే చేశారని, దానికి సంబంధించిన లెక్కలను బయట పెట్టాలని అన్నారు. జనాభా ప్రకారం ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు