చంద్రబాబుకు  గుణపాఠం చెప్తాం 

17 Mar, 2019 03:28 IST|Sakshi

బాబుకు బీసీ సంఘాల హెచ్చరిక  

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో  గుణపాఠం చెబుతామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ హెచ్చరించారు. బీసీ ఉద్యమాన్ని బలహీనం చేయడానికి  కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు 14 బీసీ సంఘాల నేతలు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్యను విమర్శిస్తే రూ. 50 లక్షలు ఇస్తామని చంద్రబాబు తెలంగాణకు కొంతమంది నేత లను పంపించి బీసీ నేతలతో బేరసారాలు చేస్తున్నారని ఆరోపించారు.

బీసీ నేతలను డబ్బులతో కొనడానికి కుట్రలు చేస్తున్నా రన్నారు. గత ఎన్నికల్లో కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసి బీసీ ఓట్లు దండుకొని ఏపీలో బాబు అధికారం చేపట్టారని విమర్శిం చారు. చంద్రబాబు కృష్ణయ్యను ఎంత అణచివేసినా ఏనాడూ బాబును విమర్శించలేదని, వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. బీసీలకు నేడు లభిస్తున్న పథకాలు కృష్ణయ్య పోరాటం వల్ల వచ్చినవేనని, బీసీ ఉద్యమ నాయకుడిగా అనేక త్యాగాలు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోకపోతే ఏపీ ఎన్నికల్లో వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడిస్తామని హెచ్చరించారు.    
 

మరిన్ని వార్తలు