ముస్లింల స్థితిగతులపై బీసీ కమిషన్‌ పరిశీలన

14 Mar, 2017 15:25 IST|Sakshi

నర్సంపేట : పట్టణంలోని పలు ముస్లిం కుటుంబాలను బీసీ కమిషన్‌ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్, జాయింట్‌ కలెక్టర్‌ హరిత సోమవారం కలుసుకున్నారు. తొలుత వారు ముందుగా ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సమావేశమయ్యారు. ఆ తర్వాత పట్టణంలోని మసీద్‌ వద్ద ఉన్న ముస్లిం కుటుంబాలను కలిసి వారి జీవన విధానం, స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. ముస్లింలకు ప్రధాన వృత్తి లేదని, దుర్భర జీవితాలను గడుపుతున్నందున వివరాలు సేకరిస్తున్నామని, నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి అందించనున్నట్లు కృష్ణమోహన్‌ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సివిల్‌ సప్లయీస్‌ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌రెడ్డి, మైనార్టీ శాఖ ఈడీ సర్వర్, వరంగల్‌ ఆర్డీఓ మహేందర్‌జీ, సంగూలాల్, కామగోని శ్రీనివాస్, నాయిని నర్సయ్య, వేముల సాంబయ్య, యాకుబ్, పాష, ఇర్ఫాన్, ముస్లింలు పాల్గొన్నారు.


గుండ్రపల్లిలో పర్యటన
నెక్కొండ(నర్సంపేట): నెక్కొండ మండలంలోని గుండ్రపల్లిలో బీసీ కమిషన్‌ సభ్యుడు కృష్ణమోహన్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ముస్లిం ప్రజల వాస్తవ జీవన స్థితిగతులను తెలంగాణ సివిల్‌ సప్లయీస్‌ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సివిల్‌ సప్లయీస్‌ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కాసీ, దుదేకుల కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు అందేలా కృషి చేస్తానని హామి ఇచ్చారు. జిల్లా కో ఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌నబీ, సర్పంచ్‌ గుగులోత్‌ నందనాయక్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు