సొంతగూటికి' తండు'

20 Nov, 2018 12:55 IST|Sakshi
కోమటిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం మాట్లాడుతున్న సైదులుగౌడ్‌

     అనుచరగణంతో కాంగ్రెస్‌లో చేరిక

     పార్టీలోకి ఆహ్వానించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

     తండు చేరికతో కాంగ్రెస్‌కు మరింత బలం 

తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు తండు సైదులుగౌడ్‌ టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 

సాక్షి, నల్లగొండ : తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు, బీసీ నాయకుడు తండు సైదులుగౌడ్‌ సొంతగూటికి చేరారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి సీఎల్పీ మాజీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో కాంగ్రెస్‌పార్టీ నుంచి తిప్పర్తి జెడ్పీటీసీగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో విజయాన్ని సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు. ఆ సమయంలో బీసీ నేతగా తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో మంత్రి జగదీశ్‌రెడ్డి సూచనల మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.  నియోజకవర్గం కలియదిరుగుతూ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తనకు అవకాశం కల్పిస్తుందనే ఉద్దేశంతో పనిచేస్తూ వచ్చారు. చివరిదశలో టికెట్‌ ఇతరులకు కేటాయించడంతో మనస్తాపానికి గురయ్యారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో సీనియర్లను గౌరవించడం లేదంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇండిపెండెంట్‌గా 
అగ్రనాయకులతో మంతనాలు
ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మేలు జరిగే అవకాశం ఉన్నందున ఒక అడుగు వెనక్కివేసి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీనియర్‌ నాయకుడు జానారెడ్డి, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తండు సైదులుగౌడ్‌తో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది బీసీ నేతగా మంచి అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అందులో భాగంగా  సోమవారం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో ఆయన నామినేషన్‌ సందర్భంగా వేలాది మంది కార్యకర్తలతో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి మరింత బలం చేకూరనుంది. ఈ సందర్భంగా తండు మాట్లాడుతూ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీనియర్‌ నాయకులు జానా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధు యాష్కీగౌడ్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు జెడ్పీ చైర్మన్‌గా బీసీకి అవకాశం వచ్చినా, జనరల్‌కు అవకాశం వచ్చినా తనకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తాను బరిలో ఉంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మేలు అయ్యే అవకాశం ఉన్నందున కోమటిరెడ్డిని గెలిపించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ కుటుంబ పార్టీగా మారడంతో పాటు పార్టీని విమర్శించిన వారికే అవకాశాలు కల్పించడం తనకు నచ్చనందుననే కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు