బీసీ స్వయం ఉపాధి అర్హుల ఎంపిక విధివిధానాలు

11 May, 2018 04:38 IST|Sakshi

ప్రకటించిన సంక్షేమ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన తరగతుల నిరుద్యోగులకు బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్‌ల ద్వారా మంజూరు చేసే స్వయం ఉపాధి యూనిట్ల పంపిణీకి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామాల్లో గ్రామ సభ, పట్టణాల్లో వార్డు సభలను నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు. పథకానికి కేటాయించిన బడ్జెట్‌లో 50% నిధులను సాంప్రదాయ వృత్తి దారులకు, మిగతా 50% జనరల్‌ స్కీంలకు కేటాయించనున్నారు.

ఒక కుటుంబం నుంచి ఒక అభ్యర్థినే ఎంపిక చేయాలని, గతంలో లబ్ధి పొందిన వారిని ఎంపిక చేయకూడదని నిబంధన విధించారు. లబ్ధిదారుల్లో 33% మహిళలకు కేటాయించనున్నారు. పేదలకు, దివ్యాంగులకు, సంచార జాతుల వారికి  ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.5, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు  మించరాదు.

మరిన్ని వార్తలు