వెబ్ ఆప్షన్లపై తస్మాత్ జాగ్రత్త

17 Aug, 2014 23:57 IST|Sakshi

శాతవాహన యూనివర్సిటీ: జిల్లాలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థులు రెండు రోజులుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ హాజరవుతున్నారు. కొందరు విద్యార్థులు గతంలో తీసుకున్న కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు. ఎంసెట్ సర్టిఫికె ట్ల పరిశీలనతోనే ఇంజినీరింగ్ కళాశాలలో చేరడం కాదు.

సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం కళాశాల ఎంపిక విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలిన ఎంసెట్ కౌన్సెలింగ్ క్యాంప్ ఆఫీసర్, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.మధుసూదన్‌రెడ్డి, కో ఆర్డినేటర్ డాక్టర్ నితిన్, అసిస్టెంట్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.సాంబయ్య సూచిస్తున్నారు. ఆదివారం నుంచే వెబ్‌ఆప్షన్లు ప్రారంభ మ య్యా యి.సందేహాలుంటే 9666670193నిసంప్రదించొచ్చు.
 
కొత్తగా వన్ టైం పాస్‌వర్డ్..
గతంలో విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పెట్టడానికి స్క్రాచ్ కార్డు ఇచ్చేవారు. అందులోని సీక్రెట్ కోడ్  ద్వారా విద్యార్థులు కళాశాలలు ఎంపిక చేసుకునేవారు. కానీ దీనిలో పీఆర్వోల జోక్యం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారనే ఆరోపణలు విన్పించాయి. దీంతో ఈసారి పీఆర్వోలకు చెక్ పెడుతూ రాష్ర్ట ఉన్నత మండలి.. వన్‌టైం పాస్‌వర్డ్ అనే ఆప్షన్ తెచ్చింది. ఈ విధానంలో కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థి ఇచ్చే ఫోన్ నంబరే కీలకం. ఒకసారే ఉపయోగించకునేలా ఒక సీక్రెట్ పాస్‌వర్డ్ విద్యార్థి సెల్‌ఫోన్‌కు మేసేజ్ రూపంలో వస్తుంది.
 
ఆ పాస్ వర్డ్‌ను ఉపయోగించుకుని విద్యార్థి నచ్చిన కోర్సులో... కోరుకున్న కళాశాలలో చేరొచ్చు. కాబట్టి విద్యార్థి తన ఫోన్ నెంబర్‌విషయంలో గోప్యతను పాటిస్తూ కౌన్సెలింగ్ సెంటర్‌లో ఇవ్వాలి. విద్యార్థి ఎంచుకునే ఆప్షన్లను లేదా కళాశాలను మార్చాలనుకున్న మళ్లీ వన్‌టైం పాస్‌వర్డ్ మొదటి ఇచ్చిన నంబర్‌కు మాత్రమే వస్తుంది. తమ కళాశాలలో చేర్చుకోవడానికి యత్నించే పీఆర్వోలతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. ఇంజినీరింగ్ కోర్సులో చేరిన వారికి తాయిలాలిచ్చేందుకూ పలు కళాశాలల యాజమాన్యాలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.  
 
కొనసాగుతున్న వెబ్ ఆప్షన్లు....
ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు వెబ్‌ఆప్షన్లు ప్రారంభమయ్యాయి. జిల్లాలో సర్టిఫికెట్ల పరిశీలనకు ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే వెబ్‌ఆప్షన్లు చేసుకోవచ్చు. జిల్లాకేంద్రంలోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలల, ఉజ్వల పార్క్ సమీపంలోని పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో ఈ ఆప్షన్లను ప్రతీ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌ఆప్షన్‌తో కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు. ఈ నెల 17, 18వ తే దీల్లో 1 నుంచి 50 వేల ర్యాంకు వరకు, 20, 21 తే దీల్లో 50001 నుంచి లక్ష ర్యాంకు వరకు, 22, 23 తేదీల్లో 100001 వ ర్యాంకు నుంచి 1,50, 000 ర్యాంకు వరకు, 24, 25 తేదీల్లో 1,50,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
 
విద్యార్థుల మొదట ఉంచిన ఆప్షన్లు మార్చాలనుకుంటే 26 వ తే దీన 1 వ ర్యాంకు నుంచి లక్ష లోపు ర్యాంకులు ఉన్న వాళ్లు, 27న లక్ష  ఒకటో ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు ఉన్న అభ్యర్థులు వారి ఆప్షన్లను మార్చుకోవచ్చు. ఈ నెల 30న విద్యార్థులకు ఏ కళాశాలల సీటు వచ్చిందనే మేసేజ్ వస్తుంది. సెప్టెంబర్ 1 సంబంధిత క ళాశాలకు వెళ్లి అన్ని విషయాలు కనుక్కోవచ్చు. విద్యార్థికి కళాశాల నచ్చకుంటే రెండో కౌన్సెలింగ్ మార్చుకోవచ్చని అధికారులు తెలిపారు.
 
తనిఖీలతో ఆరు కళాశాలలు ఔట్.?
కౌన్సెలింగ్‌కు ముందు జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 6 ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతి రద్దు చేసినట్లు విశ్వనీయ సమాచారం. ప్రస్తుతం జిల్లాలోని 12 ఇంజనీరింగ్ కళాశాలలకే వెబ్ ఆప్షన్ పెట్టాలనే విషయాన్ని విద్యార్థులు గమనించాలని అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. అనుమతి రాని కళాశాలల పేర్లను గోప్యంగా ఉంచుతున్నారు. వసతులు సమకూర్చి మళ్లీ అనుమతులను తెచ్చుకునేందకు ఆయా కళాశాల యాజమాన్యాలు పావులు కదుపుతున్నట్లు సమాచారం.  
 
కౌన్సెలింగ్‌కు 699 మంది హాజరు
ఆదివారం నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లావ్యాప్తంగా 699 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎస్సారార్ కళాశాల సెంటర్‌లో 348 మంది, మహిళా పాలిటెక్నిక్ కళాశాల కేంద్రంలో 351 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 43 మంది ఉన ్నట్లు క్యాంపు ఆఫీసర్ తెలిపారు.

మరిన్ని వార్తలు