స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అగ్రగామిగా నిలపండి     

2 Aug, 2018 14:29 IST|Sakshi
 సదస్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీదేవసేన  

పెద్దపల్లిఅర్బన్‌ : స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లాను అగ్రగామిగా నిలిపేం దుకు అన్ని శాఖల అధికారులు సమష్టిగా పని చేయాలని కలెక్టర్‌ శ్రీదేవసేన ఆదేశించారు. పెద్దపల్లి మండలం బందంపల్లి స్వరూప గార్డెన్స్‌లో స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌పై ప్రత్యేక అధికారులు, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, వీఓలు, సం బంధిత సిబ్బందికి బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 208 గ్రామపంచాయతీలకు అదనంగా మరో 65 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయన్నారు.

గురువారం నుంచి ప్రత్యే క అధికారుల పాలన ప్రారంభమవుతుందని, ఇందుకోసం అవసరమైన ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. గ్రామపంచాయతీలలో సేవలను పారదర్శకంగా అందించేందుకు భవనాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త పంచాయతీలలో పండుగ వాతావరణం క ల్పించేలా ప్రజలతో మమేకమై సేవలందించాలని పేర్కొన్నారు. ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, పరిసరాల పరిశుభ్రత పాటించేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు.

పంచాయతీ కార్యదర్శులు సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ స్వచ్ఛత వైపు అడుగులు వేయించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అధికారుల ని రంతర కృషి ఫలితంగా ప్రతీ కుటుంబానికి మరుగుదొడ్డి నిర్మించి ఏడాది క్రితమే ఓడీఎఫ్‌ జిల్లాగా ప్రకటించారని, దీనిని సుస్థిర పరిచే దిశగా ఓడీఎఫ్‌ ప్లస్‌ కార్యక్రమం నిర్వహించాలని జిల్లాలో స్వచ్ఛత రథ్‌ ద్వారా ప్రతీ గ్రామంలో పారిశుధ్యం, మరుగుదొడ్డి ఉపయోగంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు వివరించారు.

ఆగస్టు 15 వరకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన బృందాలు దేశవ్యాప్తంగా ఓడీఎఫ్‌గా ప్రకటించుకున్న 118 జిల్లాల్లో పర్యటించి, స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ పథ కం కింద చేసిన పనులను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. దీనికి గ్రామ ప్రత్యేక అధికారులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. 118 ఓడీఎఫ్‌ జిల్లాల్లో పెద్దపల్లిని ప్రథమ స్థానంలో ఉంచేలా పని చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. 

ఎస్‌ఎస్‌జీ యాప్‌లో సమాధానాలు

జిల్లాలో స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ ఎస్‌ఎస్‌జీ 18 అనే యాప్‌ను గూగూల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసి, జిల్లా స్వచ్ఛతకు సంబంధించి ప్రశ్నలకు సమాధానాలు అందించాలన్నారు. కేంద్ర బృందం గ్రామాల్లో పర్యటించినపుడు గ్రామపంచాయతీ కార్యదర్శులను, ప్రత్యేక అధికారులను, అంగన్‌వాడీ టీచర్లను, ఏఎన్‌ఎంలను స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌లో భాగంగా జిల్లాలో చేసిన కార్యక్రమాలపై వివరాలు అడుగుతారని, సమర్ధవంతంగా సమాధానం ఇవ్వాలన్నారు. 

స్వచ్ఛతకు పెద్దపీట

జిల్లాలో ట్రీగరింగ్, అవగాహన కార్యక్రమాలు, ఓడీఎఫ్‌ ప్లస్‌ కార్యక్రమాలపై కేంద్ర బృందం ప్రత్యేక దృష్టి సారిస్తున్నందున వాటిపై సమగ్ర కార్యాచరణతో సిద్ధంగా ఉండాలన్నారు. గ్రామాల్లోని పంచాయతీ భవనం, అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలు, స్వశక్తి భవనాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించి, అక్కడ ఉన్న మరుగుదొడ్లను, నీటి లభ్యత, మరుగుదొడ్ల వాడకాన్ని పరిశీలించి, 30 మార్కులు కేటాయిస్తారని పేర్కొన్నారు.

అవసరమైన చోట తగిన సూచనలు, దిద్దుబాటు చర్యలు చేయాలన్నారు. చెత్తబుట్టలను కొనుగోలు చేసి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా మహిళలు నెలసరి సమయంలో న్యాప్‌కిన్‌లు ఉపయోగించేలా చూడాలని సూచించారు. ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో చేపట్టనున్నందున శస్త్రచికిత్సలు అవసరమైన వారిని గుర్తించి, జాబితాను సిద్ధం చేయాలని, క్యాంపు వివరాలను ప్రజలకు వివరించేలా ప్రచారం నిర్వహించాలన్నారు.

కంటి వెలుగు పథకంలో భాగంగా తగిన వైద్యులు, సిబ్బంది కళ్లద్దాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో నరేగా నిధులను ఉపయోగించి స్మశాన వాటికలను నిర్మించేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలన్నారు. సమావేశంలో జేసీ వనజాదేవి, ఇన్‌చార్జి డీఆర్డీవో ప్రేమ్‌కుమార్, డీపీవో సుదర్శన్, డీఎంహెచ్‌వో ప్రమోద్, అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు