బేకరి బాయ్ నుంచి మేయర్ వరకు

10 Apr, 2016 01:15 IST|Sakshi

ఆయనది చిన్నప్పటి నుంచి ముళ్లబాటే. చదువుకునే రోజుల్లోనే తండ్రి దూరమయ్యాడు. అందరికంటే చిన్నవాడైనా ఇంటి బాధ్యత భుజాన వేసుకున్నాడు. ఇది.. అదీ అని చూడకుండా బేకరీలో, కూరగాయల మార్కెట్‌లో ఇలా.. అన్ని పనులూ చేశాడు. వైన్‌షాప్‌లో బిల్‌రైటర్‌గా చేరి.. వర్కింగ్ పార్ట్‌నర్ అయ్యూడు. అదే ఆయన వ్యాపారానికి తొలి మెట్టు.


తప్పుని సహించని తత్వంతో రాజకీయంలోకి వచ్చాడు. జీవిత భాగస్వామి ఆయనకు పెద్ద ఆస్తి. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్న నానుడి ఆయన జీవితంలో నిజమైంది. ఎంత  సంపాదించినా.. ఎంత ఎత్తుకు ఎదిగినా లారీ డ్రైవర్ కొడుకుననే విషయూన్ని మరిచిపోనంటున్న గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్

 

మరిన్ని వార్తలు