ఉత్తమ సేవకులకు అవార్డులు

25 Aug, 2014 23:58 IST|Sakshi

ఆదిలాబాద్ కల్చరల్ : జిల్లాలో కళాప్రదర్శనలు, క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారికి, ఉత్తమ సేవ కార్యక్రమాలు, సామాజిక రంగాల్లో సేవలందించిన వారికి, సంఘాలకు అవార్డులు లభిస్తాయని యువజన సర్వీసుల శాఖ జిల్లా సీఈవో వెంకటేశ్వర్లు అ న్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా యువజన సర్వీసుల శాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని యువతీ, యువకులు, కళాకారులు, ఉద్యోగుల నుంచి ఉత్తమ అవార్డులు, పద్మ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలిపారు. జాతీయ యూత్ అవార్డు కోసం 11 దరఖాస్తులు రాగా ఐ దింటిని ఎంపిక చేశామని వివరించారు.
 
సంఘా ల విభాగంలో తాండూర్‌కు చెందిన అభినవ యూత్ ఆర్గనైజేషన్, మంచిర్యాలకు చెందిన కేజీఎన్ వాలంటీర్ల ఆర్గనైజేషన్, వ్యక్తిగత విభాగంలో తాండూర్‌కు చెందిన కె.సంతోష్, ఆదిలాబాద్ మండలం అంకోలికి చెందిన ఎర్రం న ర్సింగ్‌రావు, ఆదిలాబాద్‌కు చెందిన మిట్టు రవి ఎంపికయ్యారని తెలిపారు. పద్మ అవార్డుల కోసం 27 దరఖాస్తులు రాగా.. 13 మందిని అర్హులుగా గుర్తించామన్నారు.

సాహితీ, విద్యారంగం లో నిర్మల్‌కు చెందిన మడిపెల్లి భద్రయ్య, సా మాజిక సేవారంగంలో లక్సెట్టిపేట మండలం కొత్తూరుకు చెందిన తగరపు సత్తయ్య, తాండూర్ మండలం రేచూరి గ్రామానికి చెందిన కె.సంతోష్, కళారంగంలో నిర్మల్‌కు చెందిన జోసప్ బాపూరావు, సామాజిక సేవారంగంలో బెల్లంపల్లికి చెందిన దాసరి విజయ, నిర్మల్ చెందిన చిత్ర కళాకారుడు భాస్కర్‌రాజులను ఉత్తమ పద్మ అవార్డులకు ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపించినట్లు తెలిపారు.
 
సామాజిక సేవారంగంలో ఆదిలాబాద్ మండలం దిమ్మ గ్రామానికి చెందిన పసుపుల రాజు, చెన్నూర్ మండలానికి చెందిన గర్మిళ్ల శ్రీనివాస్‌రెడ్డి, లోకేశ్వరం మండ లం ధర్మోర గ్రామానికి చెందిన మదిరి ఆంజనేయులు, ఆదిలాబాద్‌కు చెందిన అల్లొల సంతోష్‌కుమార్, గుడిహత్నూర్ మండలం తోషం గ్రా మానికి చెందిన ఎండి.షాహిద్, కళారంగంలో కడెంకు చెందిన నల్ల రాంరెడ్డి, ఆదిలాబాద్‌కు చెందిన ఫహీమ్ సర్కార్‌లను పద్మ అవార్డుల కోసం ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపించినట్లు పేర్కొన్నారు.

ఇందులో ఎంపికైన వారిని జాతీయస్థాయికి పంపిస్తారని, రాష్ట్రస్థాయిలో అవార్డులను ప్రకటిస్తారని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో  కలెక్టర్ ఎం.జగన్మోహన్, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, యువజన సర్వీసుల శాఖ సీఈవో, డీపీఆర్‌వోతో కూడిన కమిటీ వీరిని ఎంపిక చేసినట్లు తెలిపారు. సమావేశంలో రెడ్‌క్రాస్ సొసైటీ కో ఆర్డినేటర్ ఖాన్ అరీఫ్ అహ్మద్, యూత్ కో ఆర్టినేటర్ మసూద్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు