పట్టర పట్టు కుస్తీ

5 May, 2018 09:55 IST|Sakshi
కుస్తీ పడుతున్న మల్లయోధులు

టేక్మాల్‌(మెదక్‌) : మండలంలోని బొడ్మట్‌పల్లి గుట్టపై వెలసిన భద్రకాళీ సమేత వీరభద్ర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కుస్తీపోటీలునిర్వహించారు.  చివరి కుస్తీలో ఇద్దరిపై నెగ్గిన మహరాష్ట్ర ఉద్దిర్‌ గ్రామానికి చెందిన నూరత్‌బిడివికి టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు బేగరి మొగులయ్య సౌజన్యంతో 5తులాల వెండి కడియాన్ని బహుకరించారు. విజేతను దేవాలయం వరకు ఊరేగిస్తూ పూజలు నిర్వహించారు. కుస్తీ పోటీలలో పాల్గొనేందుకు కర్ణాటక, మహరాష్ట్రాలతో పాటూ  తెలంగాణలోని పలు జిల్లాలోని మల్లయోధులు వచ్చి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

 ఉత్సవాలకు హాజరైన మాజీ డిప్యూటీ సీఎం..

వీరభద్ర ఉత్సవాల్లో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ హజరయి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్‌ బీరప్ప, ఆలయ కమిటీ చైర్మణ్‌ బస్వరాజ్, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు రాందాస్, పీఎసీఎస్‌ డైరెక్టర్‌ రవిశంకర్‌లు దామోదరను పూలమాల వేసి, శాలువాతో సన్మానించి ప్రసాదాన్ని అందించారు. ఇందులో ఎంపీపీ ఉపాద్యాక్షులు విష్ణువర్దన్‌రెడ్డి, పీఎసీఎస్‌ చైర్మన్‌ యశ్వంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మరమేశ్‌ నాయకులు భరత్, విఠల్, వీరన్న, శ్రీనివాస్, కిషోర్, విద్యాసాగర్, యాదయ్య, గోవిందాచారి, శంకర్, సేవ్యానాయక్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు