‘భగీరథ’తో నీటి సమస్య పరిష్కారం

6 May, 2018 06:58 IST|Sakshi
భూమిపూజ చేస్తున్న స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి

భూపాలపల్లి అర్బన్‌ : గోదావరి అమృత జలాలను తాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రారంభించిందని శాసన సభ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మిషన్‌ భగీరథలో భాగంగా భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలో ఆరు ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణ పనులకు శనివారం స్పీకర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా తాగునీటిని శాశ్వత ప్రాతిపదికన అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మిషన్‌ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మిషన్‌ భగీరథ పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

మిషన్‌ భగీరథ ద్వారా సరఫరా అయ్యే నీటిని అమృత జలాలుగా భావించాలని సూచించారు. వచ్చే ఎండాకాలం వరకు భూపాలపల్లి పట్టణంలో తాగునీటి కొరత సమస్యే ఉండదన్నారు. భవిష్యత్‌ తరాలను దృష్టిలో పెట్టుకుని పట్టణంలో మొత్తం 10 ట్యాంకులను నిర్మిస్తామని స్పష్టం చేశారు. రూ.63 కోట్లతో పట్టణంలోని బస్టాండ్, మునిసిపల్‌ కార్యాలయాల సమీపం, సుభాష్‌కాలనీ, జంగేడు, ఖాసీంపల్లి, పుల్లూరిరామయ్యపల్లి గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ బండారి సంపూర్ణరవి, కమిషనర్‌ రవీందర్‌యాదవ్, కౌన్సిలర్లు జరీనాబేగం, హైమావతి, నిర్మల, గోనే భాస్కర్, వజ్రావని, బీవీ.చారి, రాకేష్, ఆలయ కమిటీ చైర్మన్‌ రాజయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు సాంబమూర్తి, సంపత్‌కుమార్, రవీందర్‌రెడ్డి, సమ్మయ్య, తిరుపతిరెడ్డి, శ్రీరాములు, మురళి, అందే సుధాకర్, అధికారులు రవీందర్‌నా«థ్‌ శ్రీనా«థ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు