కదం తొక్కిన కార్మిక సంఘాలు

9 Jan, 2019 08:04 IST|Sakshi
మహబూబ్‌నగర్‌ జిల్లా జనరల్‌ ఆస్పత్రి ఎదుట ఉద్యోగ, కార్మికుల నిరసన

తొలి రోజు ప్రశాంతంగా సార్వత్రిక సమ్మె 

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె తొలిరోజైన మంగళవారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు కార్మిక సం ఘాల బాధ్యులు కదం తొక్కారు. కేంద్రప్రభుత్వ విధానాలపై జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాల ద్వారా నిరసన తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రం లోని టౌన్‌హాల్‌ నుంచి సీఐటీయూ, ఐఫ్‌టీయూ, ఐఎన్‌టీయూసీ సంయుక్త ఆధ్వర్యాన భారీ ర్యాలీగా తెలంగాణ చౌరస్తాకు చేరుకుని అక్కడ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల బాధ్యు లు కురుమూర్తి, వెంకటేశ్, రాములుయాదవ్‌ మా ట్లాడుతూ మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక వి ధానాలతో అన్ని వర్గాలకు నష్టం జరగనుందన్నా రు. గత ఎన్నికల సమయంలో తమను గెలిసిస్తే దేశం అభివృద్ధి చెందుతుందని, కార్మికులు హామీలను పరిరక్షిస్తామని చెప్పిన మోదీ వాటిని విస్మరించారని ఆరోపించారు. చంద్రకాంత్, సతీష్, తిరుమలయ్య, నర్సిములు, దాసు, శేఖర్, కౌర్‌ణిసా, వినయ్, గాలెన్న పాల్గొన్నారు.

గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి 
స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఆర్‌ఆర్‌బీఈఏ అధ్యక్షుడు రవికాంత్‌ డిమాం డ్‌ చేశారు. సార్వత్రిక సమ్మెలో మంగళవారం ఏపీజీవీబీ బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సం దర్భంగా జిల్లా కేంద్రంలోని రీజినల్‌ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో రవికాంత్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చర్యలను నిరసిస్తూ దేశంలోని 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల అధికారులు, ఉద్యోగులు రెండు రోజుల సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. వాణిజ్య బ్యాంకుల మాదిరిగా గ్రామీణ బ్యాంకు ఉద్యోగులకు వేతనాలు అమలుచేయాలని, ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందిని  క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో రీజినల్‌ కార్యదర్శి ఎం.శ్రీనివాస్, రవికుమార్, నాగేశ్వర్, నాగరాజు, ఆంజనేయులు పాల్గొన్నారు.
 
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా  
మహబూబ్‌నగర్‌ రూరల్‌ : అఖిల భారత ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం కలెక్టరేట్‌ ముఖద్వారం ఎదుట టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా చేపట్టారు. కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాలలో పని చేసే ఉద్యోగులు కలెక్టరేట్‌కు చేరుకుని భోజన విరామ సమయంలో తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్‌ జిల్లా అ«ధ్యక్షుడు రామకృష్ణారావు మాట్లాడుతూ ఉద్యోగుల పాలిట ఆశనిపాతంలా మారిన సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. అలాగే, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పింఛనర్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ ధర్నాలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు