వరవరరావు ఆరోగ్యాన్ని కాపాడాలి: భట్టి విక్రమార్క​

12 Jul, 2020 19:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీమా కోరేగావ్‌ కేసులో అరెస్టయిన విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన ఆరోగ్యాన్ని కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ప్రస్తుతం ముంబయిలోని తలోజా జైలులో ఉన్న వరవరరావును మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలని, లేకపోతే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

న్యాయస్థానాలు శిక్షించిన వారికి కూడా ఆరోగ్యం బాగోలేకపోతే మెరుగైన వైద్యం అందిస్తారని, ఉరి శిక్ష వేసిన వారికి కూడా ఆరోగ్యం బాగోలేకపోతే ఉరి వాయిదా వేస్తారు. అలాంటిది రోజుల తరబడి అనారోగ్యంతో ఉన్న తెలంగాణ ప్రాంత  ఉద్యమ నేతను అక్కడి ప్రభుత్వాలు, పోలీసులు పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వరవరరావు ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు