‘ప్రభుత్వం స్పందిచకపోతే కాంగ్రెస్‌ పోరాటం’

15 Sep, 2019 14:52 IST|Sakshi

కాంగ్రెస్‌ సీఎల్పీనేత మల్లుభట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం విషజ్వరాలు, డెంగ్యూ గురించి సరైన సమాధానం ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ సీఎల్పీనేత మల్లుభట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు రోగాలతో విలవిలలాడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. ‘ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందని మంత్రి ఈటల చెబుతున్నారు. రాష్ట్రంలో అనారోగ్యం ఎక్కువగా ఉంది కాబట్టే ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరిగింది. అంతే కానీ ఇందులో ప్రభుత్వ గొప్పతనం ఏమీ లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వసతులు కల్పించకపోతే కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది’ అని భట్టి హెచ్చరించారు. నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చినా.. ప్రభుత్వం తిరస్కరించడంపై మండిపడ్డారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని అసెంబ్లీలో భట్టి పేర్కొన్నారు.

ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు : సీతక్క
యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు భూములకు ఇంతవరకు పట్టాలు లేవని.. యురేనియం తవ్వకాలపై ఇన్ని రోజులు ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. శాసనసభ, మండలి వేదికగా యురేనియం నిక్షేపాల తవ్వకాలను నిలిపివేస్తున్నట్టు వెంటనే ప్రభుత్వం తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు.

సీఎం స్వయంగా సందర్శించాలి
సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి దాదాపు వెయ్యి మంది రోగులు విషజ్వరాలతో వస్తున్నారని అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఆస్పత్రుల్లో కనీస వసతులు లేవని.. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సంగారెడ్డి ఆస్పత్రిని సందర్శించాలన్నారు. తనకు స్పీకర్ మైక్ ఇవ్వడం లేదని జగ్గారెడ్డి ఆరోపించారు. ఎంఐఎం, అధికార పార్టీ సభ్యులకు మైక్ అడుగుతే వెంటనే ఇస్తున్నారని.. ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుడిని అయినందుకు తనకు మైకు ఇవ్వలేదని మండిపడ్డారు. ఉమ్మడి మెదక్‌ జిల్లావాసి అయిన సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి సంగారెడ్డి ఆస్పత్రిని సందర్శించాలని అసెంబ్లీలో జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘దానికోసమే జనసేన పార్టీ పుట్టింది’

టీడీపీ అబద్ధాల పుస్తకం

బతికి ఉన్నన్ని రోజులూ టీఆర్‌ఎస్‌లోనే: ఎమ్మెల్యే

అభివృద్ధి కోసమే అప్పులు.. నిజాలు తెలుసుకోండి : కేసీఆర్‌

పాకిస్థాన్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన సీనియర్‌ నేత!

మేము తప్పు చేయం.. యురేనియంపై కీలక ప్రకటన

అందుకే పవన్‌ కళ్యాణ్‌ను రంగంలోకి దింపారు

'మాణిక్యాలరావు మతిభ్రమించి మాట్లాడుతున్నారు'

హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌

బడ్జెట్‌ కుదింపునకు కేంద్రమే కారణం

అదంతా కాంగ్రెస్‌ పాపమే..

ఐటీఐఆర్‌కు పైసా ఇవ్వలేదు

‘హిందీ’ తేనెతుట్టెను కదిపిన అమిత్‌ షా!

రోగాల నగరంగా మార్చారు

మీ లెక్కలు నిజమైతే నిరూపించండి..

‘ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించాలి’

‘తలుపులు తెరిస్తే ఒక్క ఎంపీ కూడా మిగలరు’

పవన్‌పై మంత్రి అవంతి ఘాటు వ్యాఖ్యలు

అర్వింద్‌ను కలిస్తే తప్పేంటి..?: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

‘రియల్‌ హీరోను చూసి ఓర్వలేకపోతున్నారు’

పార్టీ అధ్యక్షుడిగా పవన్‌కు అది కూడా తెలియదా?

పవన్‌కు కౌంటర్‌ ఇచ్చిన ఎమ్మెల్యే కిలారి రోశయ్య

ఏసీ రూముల్లో బాగా నిద్ర పట్టిందన్న బాధితులు..

హరీశ్‌, జీవన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం

షా వ్యాఖ్యలు షాకిచ్చాయ్‌..

చోద్యం చూశారే తప్ప.. ప్రశ్నించారా..!

కుల రాజకీయాలతో అమాయకుల బలి

దేశమంటే..హిందీ, హిందూ, హిందుత్వ కాదు: ఒవైసీ

కేసీఆర్‌ వారి చరిత్రను తొక్కిపెడుతున్నారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అవార్డులు వస్తాయంటున్నారు : ‘మార్షల్’ సక్సెస్‌మీట్‌లో శ్రీకాంత్‌

గోవా నుంచి రిటర్న్‌ అయిన ‘డిస్కో రాజా’

ఆ సినిమా పక్కన పెట్టిన బన్నీ!

అభిమానులకు సూర్య విన్నపం

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన అనసూయ

కంగనా డిమాండ్‌ రూ.20 కోట్లు?