పర్యాటక ఆతిథ్య రంగంలో నిథమ్ పాత్ర భేష్

26 Sep, 2014 01:07 IST|Sakshi

రాయదుర్గం: పర్యాటక ఆతిథ్య రంగంలో విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంలో డాక్టర్ వైఎస్సార్ నిథమ్ ముఖ్య భూమిక పోషిస్తోందని నిథమ్ స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ ప్రిన్సిపల్ సుధాకుమార్ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని డాక్టర్ వైఎస్సార్ నిథమ్‌లో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ, పర్యాటక దినోత్సవాన్ని పురష్కరించుకొని రెండు రోజులపాటు నిర్వహించిన పోటీలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుధాకుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర పర్యాటక శాఖల సహకారంతో వైఎస్సార్ నిథమ్ పలు కోర్సులను నిర్వహించడమే కాకుండా స్వయం ఉపాధి పొందేందుకు అన్ని వర్గాల వారికి నిరంతరం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు.
 
నిథమ్‌ను సందర్శంచిన విదేశీ ప్రతినిధులు...

గచ్చిబౌలిలోని డాక్టర్ వైఎస్సార్ నిథమ్‌లో ఇరాన్, ఇరాక్, మయన్మార్, భూటాన్, ఆఫ్రికా దేశాలకు చెందిన పర్యాటక శాఖ ప్రతినిధులు నిథమ్‌ను సందర్శించారు. నిథమ్‌లో నిర్వహిస్తోన్న కోర్సుల, శిక్షణ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నిథమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మిసెల్లి జె ఫ్రాన్సిస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు