టీఆర్‌ఎస్‌లో చేరిన భానుప్రసాదరావు

26 Jun, 2014 03:32 IST|Sakshi
టీఆర్‌ఎస్‌లో చేరిన భానుప్రసాదరావు

పెద్దపల్లి : కాంగ్రెస్ ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు బుధవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి పై పోటీచేసి ఓటమి చెందిన భానుప్రసాద్‌రావు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి గులాబీ గూటికి వెళ్లారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సైతం హాజరయ్యారు. భానుప్రసాదరావు అనుచరులుగా ఉన్న ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులను సైతం టీఆర్‌ఎస్‌లోకి తీసుకువె ళ్లేందు కు సన్నద్ధం అవుతున్నారు భానుప్రసాద్ వెంట సుల్తానాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
 
 పెద్దపల్లి టీఆర్‌ఎస్‌లో
 నేతల సందడి
 పెద్దపల్లి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌లో నేతలకు కొదవలేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రేవతీరా వు, ఇద్దరు, ముగ్గురు రాష్ట్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. పార్టీ నుంచి వెళ్లిన పొలిట్‌బ్యూరో సభ్యుడు సి.సత్యనారాయణరెడ్డి మళ్లీ గులాబీగూటికి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు అక్కడ పెద్దగా గుర్తింపు లభించకపోవడంతో తిరిగి సొంతపార్టీలో చేరితేనే మేలని భావిస్తున్నారు. ఆయన అనుచరుల్లో కొందరు తనతోపాటే కాంగ్రెస్‌లోకి వెళ్లగా... మరికొందరు ఇప్పటికీ టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నారు.
 
 ‘గీట్ల’ తనయుడి సమాలోచనలు
 మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి తనయుడు రాజేందర్‌రెడ్డి గులాబీ పార్టీలో చేరేందుకు తన అనుచరులతో చర్చలు సాగిస్తున్నారు. రెం డు వారాలుగా ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోం ది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ము కుందరెడ్డి అనుచరవర్గం మనోహర్‌రెడ్డి శిబిరానికి వెళ్లింది. భానుప్రసాదరావు ముందే చేరడంతో సీఎస్సార్, గీట్ల రాజేందర్‌రెడ్డి తమ ప్రయత్నాలు రద్దు చేసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా వినిపిస్తోంది.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా