సిరికొండలో బీడీ కార్మికుల ర్యాలీ

10 Feb, 2015 18:56 IST|Sakshi

నిజామాబాద్: బీడీ కట్టలపై 85శాతం గొంతు కేన్సర్ బొమ్మను ముద్రించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ బీడీ కార్మికుల నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
(సిరికొండ)

మరిన్ని వార్తలు